Bengaluru: లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న మహిళపై కత్తి, సుత్తితో దాడి.. బెంగళూరులో బైటపడ్డ షాకింగ్ ఘటన..
Man kills his son in bengaluru: అపార్ట్ మెంట్ లో మహిళ అరుపులు విన్పించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
Man allegedly attacks on live in relation partner in bengaluru: కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పద్మనాభ నగర్ లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళపై, ఆమె కొడుకుపై సుదీప్ అనే బ్యాంకు ఉద్యోగి కత్తి, సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మైసూర్ కు చెందిన సుదీప్ బ్యాంక్ పనిచేస్తున్నాడు. ఇతనికి ఇన్సురెన్స్ కంపెనీలో పనిచేస్తున్న వివాహిత అయిన సీమదాస్ తో పరిచయం ఏర్పడింది. ఆమె తన 18 ఏళ్ల కొడుకుతో ఉంటుంది. దీంతో సుదీప్ తో పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మనాభ నగర్ లో ఉన్న అపార్ట్ మెంట్ లో మకాం మార్చారు. ఇద్దరు పెళ్లి కాకుండానే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. మరోవైపు సీమదాస్ పై ఇటీవల సుదీప్ అనుమానం పెంచుకున్నాడు.
ఆమె మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తరచుగా గొడవలు పడేవాడు. ఇటీవల ఈ గొడవలు కాస్త పీక్స్ కు చేరాయి. నవంబర్ 16 న రాత్రి సుదీప్ 18 ఏళ్ల కొడుకుపై కత్తి, సుత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత సీమదాస్ ను గదిలో పెట్టి బంధించాడు. ఇంట్లో నుంచి అరుపులు విన్పించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అపార్ట్ మెంట్ వాసులు, పోలీసులు వచ్చి డుప్లికేట్ లాక్ తో డోర్ తెరిచి చూడగా ఇల్లంతా రక్తపు మరకలతో నిండిపోయింది. మరోవైపు సీమదాస్ గదిలో నుంచి కాపాడాలని అరుపులు పెట్టింది. వెంటనే ఆమెను పోలీసులు బైటకు తీసుకుని రావడంతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలుడి శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.