Rajasthan: వన్ లిప్ కిస్ ప్లీజ్.. థాయ్ యూబ్యూబర్‌కు ఉదయ్ పూర్ లో లైంగిక వేధింపులు.. వీడియో వైరల్..
Thai youtuber molested: ప్రముఖ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ జస్ట్ కెత్ పై వేధింపుల ఘటనపై నెట్టింట దుమారం చెలరేగింది. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Man asked one lip kiss to thai youtuber udaipur video: మనదేశంలోని పలు ప్రాంతాల్ని సందర్శించేందుకు ఇటీవల విదేశీయులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా యూట్యుబర్ లు వచ్చి ఇక్కడి ప్రాంతాల్ని సందర్శించి సోషల్ మీడియాలో రీల్స్ లు పోస్ట్ చేస్తున్నారు. అయితే.. చాలా మంది విదేశీయులకు ఇక్కడి వాతావణం కొత్తగా ఉంటుంది. పైగా భాష కూడా రాక పొవడం వల్ల కొంత మంది కామాంధులు ఒంటరిగా వచ్చే విదేశీ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళలకు లాడ్జీలకు తీసుకెళ్తామని, సాయం చేస్తామని చెబుతూ వారిని ట్రాప్ చేస్తున్నారు. మరికొంత మంది సెల్ఫీలు, రీల్స్ పేరిట వారిపట్ల అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ ను సందర్శించేందుకు వచ్చిన ప్రముఖ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ 'జస్ట్‌కెత్' కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె అక్కడి ప్రాంతాల్ని వీడియో తీస్తుంది. ఇంతలో సదరు యువతి లైవ్ స్ట్రీమింగ్ లో ఉండగానే.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ఆ తర్వాత వన్ లిప్ కిస్ అంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నిరాకరించిన కూడా కనీసం చెంప మీద అయిన ఒక ముద్దు కావాలంటూ బరితెగించి ప్రవర్తించాడు. ఈ ఘటనతో ఆమె షాక్ కు గురైంది.
అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గకుండా అదే అభ్యర్థనను మళ్లీ మళ్లీ చేస్తూ ఆమెను ఇబ్బందికి గురిచేశాడు. చివరకు ఫోటో అయిన దిగుతానని వేధించాడు. ఇక చేసేది లేక ఆమె లైవ్ లోనే అతనితో ఫోటో దిగింది. అతగాడు, షేక్ హ్యాండ్ ఇవ్వవడానికి ప్రయత్నించగా ఆమె తిరస్కరిస్తు పిడికిలితో అతడ్నినియంత్రించింది.
ఈ మొత్తం ఘటన లైవ్ స్ట్రీమింగ్ లో రికార్డు అయ్యింది. ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ అతిథి దేవో భవ అని గొప్ప నానుడిని పాటిస్తుందని ఇలాంటి నీచుల వల్ల మన దేశంకు చెడ్డపేరు వస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ కామాంధుడ్ని గుర్తించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.