Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..
Monkey hugs into shop in odisha: కూల్ గా కొండ ముచ్చు షాపులోకి ప్రవేశించింది. ఆ తర్వాత అది కాస్త ఓనర్ ను ప్రేమతో హత్తుకుంది. ఈ ఘటనను చూసి అక్కడి వారు షాక్ అయ్యారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Monkey walks into shop and hugs owner in odisha video: సాధారణంగా కోతులు ఒకప్పుడు గ్రామంలో ఎక్కువగా ఉండేవి. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఇండ్లపైకి దాడులు చేసేవి . ఏమాత్రం అ జాగ్రత్తగా ఉన్న కూడా అవి దాడి చేసి అందిన కాడికి లాక్కెళ్లిపోతాయి. కొన్నిసార్లు అవి క్రూరంగా దాడులు చేస్తాయి. కోతుల దాడుల్లో ఇటీవల చాలా మంది గ్రామాల్లో తరచుగా ఆస్పత్రుల బారిన పడుతున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం కోతుల సంచారం ఇటీవల మరీ ఎక్కువయ్యింది. పాపం.. అవి కాంక్రీట్ జంగిల్ కూడా తిరుగుతూ ఎక్కడైన తినే పదార్థాలు దొరుకుతాయో అని తెగ వెతుకుతున్నాయి.
ఈ క్రమంలో తమ షాపులోకి లేదా ఇండ్లలోకి కోతులు ప్రవేశించకుండా కొంత మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒడిషాలోని దుకాణంలోకి ఒక కొండెంగ ప్రవేశించింది.ఈ వీడియో వైరల్ గా మారింది. ఒడిశాలో స్థానికంగా ఉన్న కొండెంగ మొబైల్ లు ఉన్న దుకాణంలోకి ప్రవేశించింది. అది కాస్త టేబుల్ మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఓనర్ ముందు కూర్చుంది.
అతని వంక చూసింది. మరీ ఇంతలో ఏమనిపించిందో కానీ ఆయనపై కూర్చుని హత్తుకుంది. చాలా సేపు సదరు వ్యక్తిని చిన్న పిల్లాడిలా హత్తుకుంది. అక్కడి వారు కొండెంగ ఎక్కడ కరుస్తుందో అని భయపడుతుంటే కొండెంగ మాత్రం కూల్ గా ఆయన్ను హత్తుకుంది.ఈ అరుదైన ఘటనను దుకాణంలో ఉన్నవారు ఫోన్ లో వీడియో తీశారు.అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.