Monkey Washing Clothes Viral Video: కోతులు చేసే చేష్టాలు సాధారణంగా ఎంత అల్లరిగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కొన్నిసార్లు అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనుషులు చేసే పనులు గమనించి.. అచ్చం అలాగే అనుకరించడంలో కోతుల తర్వాతే వేరే ఏ జంతువైనా ఉంటుంది.. తాజాగా అలాంటి ఒక అరుదైన అత్యంత ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. మనుషుల్లాగే స్వయంగా బట్టలు ఉతుకుతూ.. వాటిని ఎంతో అద్భుతంగా శుభ్రం చేస్తున్న కోతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ధోబి ఘాట్ సమీపంలో నానబెట్టిన దుస్తులు ఉండడం మీరు చూడొచ్చు.. అక్కడే కూర్చున్న ఒక కోతి.. బట్టలను చేతుల్లోకి తీసుకొని అచ్చం మనుషుల్లాగే ఉతికినట్లే.. నీటిలో పెడుతూ ఉతుకుతూ కనిపిస్తోంది. ఇంతటితో ఆగకుండా ఆ తడి బట్టలను తన రెండు చేతుల్లోకి గట్టిగా పట్టుకొని.. పైకి కిందికి ఎగురుతూ నీళ్లు పిండుతూ మరి బట్టలు ఉతికేస్తోంది.
కోతి యజమాని పక్కనే నిలబడి ఈ మొత్తం తథంగాన్ని తన స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించింది. పోతి చేస్తున్న పనికి ఎవరు అడ్డు చెప్పుకోకపోవడంతో.. అది మరింత ఉత్సాహంతో బట్టలను శుభ్రం చేయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దాని యజమాని కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తూ బట్టలు పిండించుకోవడం మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో.. చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో సైతం షేర్ చేస్తున్నారు. వేల సంఖ్యలో లైకులతో ఈ వీడియో దూసుకుపోతోంది. తెలివితేటలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతూ రకరకాల కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఇంట్లో వాషింగ్ మిషన్ కొనే ఖర్చు తప్పినట్లే.. అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. కోతికి ఏదైనా లాండ్రీ షాప్ లో ఉద్యోగం ఇస్తే బాగుండు అని మరి కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఇక మరి కొంతమంది మనుషుల కంటే చక్కగా పనిచేస్తుంది కదా.. అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు..
మనుషుల అలవాట్లను జంతువులు ఎంతో వేగంగా నేర్చుకోగలుగుతాయని చెప్పడానికి ఈ ఘటనే చక్కటి నిదర్శనం అని చాలామంది అంటున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోయిన సోషల్ మీడియా వినియోగదారులకు.. ఇలాంటి సరదా జంతువులకు సంబంధించిన వీడియోల నుంచి ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి.. ముఖంపై చిరునవ్వు వస్తుందని.. కాబట్టి ఇలాంటి వీడియోలు చూడడం కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.