• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నాగుపాముపై తల్లి, పిల్ల కుక్క దాడి.. తోకను కొరికిన చిన్న కుక్క.. వీడియో..

నాగుపాముపై తల్లి, పిల్ల కుక్క దాడి.. తోకను కొరికిన చిన్న కుక్క.. వీడియో..

Mother Dog And Puppy Attack Cobra Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ పిల్ల కుక్కతో పాటు తల్లి కుక్క అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పై దాడి చేశాయి.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ముఖ్యంగా పిల్ల కుక్క అయితే.. నాగుపాము తోక భాగంలో దాడి చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 27, 2026, 12:47 PM IST|Updated: Sep 27, 2026, 12:50 PM IST
joinshare
నాగుపాముపై తల్లి, పిల్ల  కుక్క దాడి.. తోకను కొరికిన చిన్న కుక్క.. వీడియో..
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mother Dog And Puppy Attack Cobra Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా రెండు జంతువుల మధ్య దాడి, మూగజీవాలకు సంబంధించిన వింతలు విశేషాలు అప్పుడప్పుడు చిన్న రీల్స్ రూపంలో వైరల్ అయి.. సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒళ్ళు గగ్గులు పొడిచే ఓ అరుదైన వీడియో ఇంటర్నెట్‌లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా నాగుపాము పేరు వింటేనే మనుషులతో పాటు ఇతర జంతువులు కూడా భయంతో ఉన్న చోటు నుంచి పరుగులు తీస్తూ ఉంటాయి. ఒక్క కాటుతో ప్రాణాలు తీయగల ఆ విష సర్పం ఎదురొస్తే ఎంతటి జంతువైనా తోక ముడుచుకొని వెళ్లడం మనం ఇదివరకు ఎన్నో వీడియోలో చూస్తున్న. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో మాత్రం దీనికి పూర్తిగా రివర్స్ లో ఉంది. అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కే రెండు కుక్కలు ఊహించని షాకిచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియోలో ఏముందో? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ వీడియోలో ఏం ఉంది.?
ఓ బహిరంగ ప్రదేశంలో ప్రమాదకరమైన నాగుపాము ప్రవేశించింది. అయితే, దాన్ని చూసి ఏమాత్రం భయపడని ఓ తల్లి కుక్క.. దాని చిన్న పిల్ల ఆ పాము పై దాడికి దిగాయి.  తన బిడ్డను రక్షించుకోవాలని సహజగుణంతోనే తల్లి కుక్క ముందుండి  ఆ పాము పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దానికి తోడుగా చిన్న పిల్ల కుక్క కూడా ఏమాత్రం బెదరకుండా రెండు కలిసి పదేపదే పాముపై ఊహించని స్థాయిలో దాడికి దిగాయి. ఏకకాలంలో రెండు కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఏమీ తెలియాలో ఆ పాముకు తోచలేక పోయింది..

పిల్ల కుక్క ఏం చేసింది?
ఈ కుక్కల దాడిలో ఆగుపాము తీవ్రంగా గాయపడినట్లు ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడొచ్చు. ముఖ్యంగా పిల్ల కుక్క ఊహించని స్థాయిలో దాడి చేయడంతో ఆ పాము ఎటూ కదలలేని నిస్సహాయక స్థితిలోకి చేరింది. పాము పడక విప్పి వాటిపై దాడి చేసే శక్తిని సైతం కోల్పోయింది.. ముఖ్యంగా ఇదే సమయంలో పిల్ల కుక్క మరింత రెచ్చిపోయింది.. ఏకంగా విష సర్పం తోక భాగాన్ని పదేపదే బలంగా కొరుకుతూ దానిని నానా తిప్పలు పెట్టేసింది. అంతటి ప్రమాదకరమైన జీవిని అంత చిన్న పిల్ల కుక్క ఎంతో ధైర్యంగా లాగుతూ.. పెరగడంతో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం షాక్ అయిపోతున్నారు..

ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి ఈ వీడియో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు. బిడ్డ జోలికి వస్తే తల్లి ఎంతటి ప్రమాదం నైనా ఎదుర్కొంటుంది.. అది కుక్క అయినా సరే.. అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. ఆ పిల్ల కుక్క ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటూ మరికొంతమంది దానిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Dandu vijaya ramaraju 45 (@ramu_breeding_farms_45)

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News