• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /7,000mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరా.. Motorola Edge 70 Neo ఫీచర్లు ఇవే!

7,000mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరా.. Motorola Edge 70 Neo ఫీచర్లు ఇవే!

Motorola Edge 70 Neo Launch: త్వరలోనే భారత మార్కెట్‌లోకి మోటరోలా ఎడ్జ్ 70 నియో మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ 7,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 28, 2026, 01:38 PM IST|Updated: Oct 28, 2026, 01:39 PM IST
joinshare
7,000mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరా.. Motorola Edge 70 Neo ఫీచర్లు ఇవే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Arnab Cyclone Effect: ఏపీలో అర్నాబ్ తుపాన్ బీభత్సం.. ఏడుగురు దుర్మరణం.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Arnab Cyclone Effect: ఏపీలో అర్నాబ్ తుపాన్ బీభత్సం.. ఏడుగురు దుర్మరణం.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

2

Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు..అలాగే అక్టోబరు 31న కూడా మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?

3

Telangana Farmers Yasangi Crisis: పల్లెల్లో మళ్లీ యాసంగి కంగారు.. అడుగంటిపోతున్న నీటి వనరులు..!

4

7,000mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరా.. Motorola Edge 70 Neo ఫీచర్లు ఇవే!

5

MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా? ఎస్ఈసీ నిర్ణయం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Motorola Edge 70 Neo Launch: మోటరోలా మార్కెట్‌లోకి ఎప్పుడు మంచి స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్‌లో బాగా విక్రయాలు జరగడం వల్ల కంపెనీ ఈ సిరీస్‌లో దిమ్మతిరిగే మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మోటరోలా ఎడ్జ్ 70 నియో మొబైల్‌ను కూడా లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టెక్‌ నిపుణులు సోషల్ మీడియాలో లీక్‌ చేసిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లోకి మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 8GB ర్యామ్‌తో పాటు 256 GB ఇంటర్నల్‌ స్టోరేన్‌ను కలిగి ఉంటుంది. ఇది మొత్తం నాలుగు రంగుల్లో లాంచ్‌ కానుంది. అలాగే 6.78-అంగుళాల 1.5K డిస్‌ప్లేతో మోస్ట్ వపర్‌ఫుల్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. అయితే, కంపెనీ మాత్రం ఇంకా విడుదల తేదిని అస్సలు ప్రకటించలేదు..

మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ లైటియా 710 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.. ఇది 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇందులో 45W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పాటు 7,000mAh బ్యాటరీని కలిగి ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది..

ఇక గత సంవత్సరం సెప్టెంబర్‌లో కంపెనీ మోటరోలా ఎడ్జ్ 60 నియోను అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇది మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగిన 6.4-అంగుళాల ఫ్లాట్ pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ కూడా లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధానర కెమెరాతో పాటు అదనంగా 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, అదనంగా మరో కెమెరాను కూడా కలిగి ఉంటుంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News