Motorola Signature 27: ఇంటర్నేషన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా మరోసారి తన సత్తా చాటింది. అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం డిజైన్‌తో Motorola Signature 27 ఫోన్ విడుదలైంది. ఇటీవలే జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ వేదికగా.. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రదర్శించింది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన మోటోరోలా సిగ్నేచర్‌కు కొనసాగింపుగా రెండో మోడల్‌గా ఇది ఉండబోతోంది. అయితే, దీనిని కంపెనీ ఎలాంటి ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఎలాంటి ప్రీమియం ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శక్తివంతమైన ప్రాసెసర్..
క్వాల్‌కామ్ ఇటీవలే పరిచం చేసిన అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 (Snapdragon 8 Elite Extreme Gen 6) ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి రాబోతోంది. అయితే, ఈ మొబైల్ శక్తివంతమైన ప్రాసెసర్స్ వస్తున్న మొట్టమొదటి మొబైల్‌గా భావించవచ్చు. ఇది అడ్వాన్స్‌డ్ చిప్‌సెట్ డివైజ్‌లో On-device AI సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు హెవీ గేమింగ్ రెస్పాన్సివ్‌నెస్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.
200 మెగాపిక్సెల్ కెమెరా..
కెమెరాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిలో కంపెనీ ఎంతో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA 910 ప్రధాన కెమెరాతో అందుబాటులో ఉంది. దీంతో పాటు శక్తివంతమైన 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన వీడియో క్వాలిటీ అవుట్‌ఫున్ అందిస్తోందని కంపెనీ తెలిపింది. అయితే, ఇందులో ఇంత పెద్ద కెమెరాను అందించేకు అసలు కారణం.. దీని మార్కెట్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకేనని సమాచారం.. అలాగే వీడియో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ ఫీచర్ కూడా అందిస్తోంది.
7 ఏళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్..
ఇందులో కంపెనీ కస్టమర్స్‌కి దీర్ఘకాలిక భరోసా కల్పిస్తూ ఏకంగా 7 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌గ్రేడ్స్‌ను కూడా అందిస్తున్నట్లు Motorola ప్రకటించింది. అలాగే దీనిని కంపెనీ ఆండ్రాయిడ్ 17 వెర్షన్‌తో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశౄలు ఉన్నట్లు తెలుస్తోంది. మోటోరోలా చరిత్రలోనే మొదటిసారిగా ప్రపంచ ప్రాముఖ్యత ఉన్న Bang And Olufsen ఆడియో సిస్టమ్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే దీనిని కంపెనీ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.