SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Avenue Towers Flats: సరోజనీ నగర్‌ ప్లాట్ల తిరిగి వేలం.. న్యాయస్థానంలో వివాదం

NBCC Decision Went To Controversy Over Re E Auction Of Avenue Towers Flats: తీవ్ర వివాదస్పదమైన ఢిల్లీలోని సరోజినీ నగర్ ఫ్లాట్ల వేలంపై న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకుంది. ఎన్‌బీసీసీ తన అధికార పరిధిని అతిక్రమించినట్టుగా తెలుస్తోంది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ సరోజినీ నగర్ ఫ్లాట్ల వేలం ప్రారంభమైంది.

Written By Ravi Kumar Sargam
Published: Nov 16, 2026, 20:57 IST | Updated: Nov 16, 2026, 21:03 IST
Image Credit: Source: Gemini Pro
Join

Avenue Towers Flats: ఢిల్లీలోని సరోజినీ నగర్ లోని అవెన్యూ టవర్స్‌లో ఫ్లాట్ల రీ-ఈ-ఆక్షన్ వివాదంలో ఎన్‌బీసీసీ చిక్కుకుంది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ 49 ఫ్లాట్ల వేలం నిర్వహించడం, సేల్ డాక్యుమెంట్లలో కేసు పెండింగ్‌లో లేదని పేర్కొనడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎన్‌బీసీసీ తన అధికార పరిధిని అతిక్రమించిందా? సరోజినీ నగర్ ఫ్లాట్ల వేలం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. కోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లో ఉండగా, ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని ఎన్‌బీసీసీ దావా చేస్తోంది. మరోవైపు ఎన్‌బీసీసీ ఫ్లాట్ల వేలాన్ని తిరిగి ప్రారంభించింది. ఫ్లాట్ యజమానులను తప్పుదారి పట్టిస్తున్నారా.. కొత్త కొనుగోలుదారులకు అబద్ధాలు చెబుతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ-వేలంలో ప్రభుత్వ కంపెనీలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు చట్టం ముందు నిలబడతాయా? ఢిల్లీ హైకోర్టు ఈ ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ అయిన NBCCకి నోటీసులు జారీ చేసి వివరణ కోరడంతో ఇది తీవ్రమైన ప్రశ్నగా మారింది.

ఈ అంశం సరోజినీ నగర్‌లోని అవెన్యూ టవర్స్ వేలానికి సంబంధించినది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. అంతా సజావుగా సాగుతోందని చెప్పుకుంటూ వేలాన్ని తిరిగి ప్రారంభించడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ హైకోర్టులో సవాలు
ఈ మొత్తం వివాదానికి మూల కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు. జనవరి 6, 2026న గోల్డెన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇండియా వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేసులో, వేలం ప్రక్రియకు దాని స్వంత చట్టపరమైన ప్రాముఖ్యత, పవిత్రత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎవరైనా వ్యక్తి చెల్లుబాటయ్యే, రిజర్వ్ ధర కంటే ఎక్కువ ఉన్న అత్యధిక బిడ్‌ను దాఖలు చేస్తే.. ఎలాంటి గట్టి, సరైన కారణం లేకుండా దానిని రద్దు చేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అధికారులు ఎక్కువ ధరను ఆశించినంత మాత్రాన అత్యధిక బిడ్‌ను తిరస్కరించలేమని కోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పు ఆధారంగా పిటిషనర్లు వేసిన అత్యధిక బిడ్‌ను సరైన కారణం లేకుండా తిరస్కరించడంతో NBCC చర్యను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.

తదుపరి విచారణ జనవరి 12, 2027కి వాయిదా పడింది. ఈ విషయ తీవ్రతను గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఎన్‌బీసీసీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జనవరి 12, 2027కి షెడ్యూల్ చేసింది. అయితే అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ నవంబర్ 6, 2026న అవెన్యూ టవర్స్ ఫ్లాట్ల ఈ-వేలం కోసం కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎన్‌బీసీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 28న గతంలో వేలం రద్దు చేసిన ఫ్లాట్లు కూడా ఈ 49 యూనిట్లలో ఉన్నాయి. కొత్త సేల్ డాక్యుమెంట్లలోని క్లాజ్ 6.5 ప్రకారం.. ఆస్తికి సంబంధించి ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని పేర్కొంటున్నారని.. అదే సమయంలో హైకోర్టులో ముగ్గురు పిటిషనర్ల పిటిషన్‌పై విచారణ జరిగి నోటీసులు కూడా జారీ చేశాయని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి వివాదాస్పద యూనిట్లకు బిడ్ వేయాలనుకునే కొత్త కొనుగోలుదారులకు చట్టపరమైన అనిశ్చితిని సృష్టిస్తోంది. ఎందుకంటే ఆ ఆస్తి కోర్టు పరిధిలో ఉందని వారికి సమాచారం ఇవ్వడం లేదు. ఈ కొత్త వేలంలో ఎన్‌బీసీసీ రిజర్వ్ ధరను సుమారు 10 శాతం పెంచింది. గతంలో చదరపు అడుగుకు రూ.37,161 ఉండగా ఇప్పుడు దానిని రూ.40,877కి పెంచారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్‌బీసీసీ వేలం ప్రక్రియ పవిత్రతను భగ్నం చేసిందా? కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అంతా బాగుందని చెప్పి కొత్త కొనుగోలుదారులను తప్పుదారి పట్టిస్తోందా? వేలం ప్రక్రియను పునఃప్రారంభించాలనే ఎన్‌బీసీసీ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కొనుగోలుదారులు అంటున్నారు. ఎందుకంటే తమ వాదనను వినిపించడానికి అన్ని పార్టీలకు సమాన అవకాశం లభించలేదు.

వేలంపై సుప్రీంకోర్టు తీర్పు ఏమి చెబుతోంది?
సహేతుకమైన కారణాలు లేకుండా అత్యధిక బిడ్‌ను తిరస్కరించలేరు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీలోని అవెన్యూ టవర్ వేలాన్ని ఎన్‌బీసీసీ పునఃప్రారంభించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కొనుగోలుదారులు తెలిపారు. కొనుగోలుదారుల వాదన వినకుండానే ఎన్‌బీసీసీ వేలం ప్రక్రియను ప్రారంభించడాన్ని తప్పుబడుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES