Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..
Baby born with mustache video: చిన్నారి ముఖంపై లేత మీసాలు కన్పిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
New Baby born with facial hair mustache video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తిని చూపిస్తారు.ఈ క్రమంలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే చాలా వింతగాను ఉంటాయి. ఇటీవల చాలా మంది ఎక్కడ ఎలాంటి ఫన్నీ వీడియోలు కన్పించిన వెంటనే తమ ఫోన్ లలో రికార్డు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నెటిజన్లు కాస్తంత వెరైటీగా ఉండే వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక బుడ్డొడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిలో అతనికి మీసాలు కూడా కన్పిస్తున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక బుడ్డొడుపుట్టిన నిముషాల వ్యవధిలోనే అతని ముఖంపై మీసాలు కన్పిస్తున్నాయి. నార్మల్ గా పిల్లలు పుట్టాక చాలా క్యూట్ గా ఉంటారు. వారిబుగ్గలు చాలా అందంగా ఉంటాయి.
ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం బుడ్డొడు పుట్టిన కొన్ని గంటలకే అతని ముఖంపైన మీసాలు కన్పిస్తున్నాయి. అతను ఏదో పెద్ద వారికి వచ్చినట్లు మీసాలు అతని ముఖంపై మొలిశాయి. చూసేందుకు చిన్నగా ఉన్నా మీసాలు మాత్రం పెద్దవారికి వచ్చినట్లు వచ్చాయి. మరీ జన్యుపరమైన మార్పుల వల్ల ఇలా మీసాలు వచ్చాయో లేదా మరేంటో కానీ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది దీన్ని ఏఐతో జనరేట్ చేశారో ఏమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.