• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..

పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..

Prabhas Answers on Upcoming Movies: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఫుట్టినరోజున తన సినిమాలకు సంబంధించిన బిగ్ అప్‌డేట్స్ ఇచ్చారు. మొత్తంగా ‘ఫౌజీ’ మూవీ నుంచి స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 01:23 PM IST|Updated: Oct 24, 2026, 01:25 PM IST
joinshare
పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..
Image Credit: Prabhas Pan India Star (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pakistan Host T20 World Cup: పాకిస్థాన్‌లో 2028 టీ20 ప్రపంచకప్..దాయది దేశంలో అడుగుపెట్టనంటున్న టీమ్ఇండియా!

Pakistan Host T20 World Cup: పాకిస్థాన్‌లో 2028 టీ20 ప్రపంచకప్..దాయది దేశంలో అడుగుపెట్టనంటున్న టీమ్ఇండియా!

2

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

3

పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..

4

Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..

5

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Prabhas Big Updates: డార్లింగ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన కల్కి 2 నుంచి ప్రత్యేక ట్రీట్ అందించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సీక్వెల్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే మొదటి భాగంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన కల్కి టీమ్, రెండో భాగంతో ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతోందన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది. ఈ సారి కర్ణుడిగా.. భైరవుడిగా ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తైయినట్టు సమాచారం. ‘కల్కి 2’  షూటింగ్‌లో ప్రభాస్ ఎపుడు జాయిన్ అవుతాడనే దానిపై  ఈ సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది.  భైరవగా డార్లింగ్ మరోసారి ఎప్పుడు సెట్స్‌లో అడుగుపెడతాడు? ఈ ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో మాత్రం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే కదా. ఇక జూన్ 2027 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ప్రశాంత్ నీల్ బిగ్ ‌అప్‌డేట్ ఇచ్చాడు. ఇక ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రభాస్ పుట్టినరోజున కాకుండా దసరా నవరాత్రిల్లోనే ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్ నుంచి దీపావళికి పోస్ట్ పోన్ అయినట్టు ప్రకటించారు.

ఇక రాత్రి ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ఈ గ్లింప్స్‌లో ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగిన సంభాషణలో యుద్దంలో గెలవాలంటే బలం సరిపోదు. తెలివి కావాలి. తన దగ్గర పనిచేసే ఓ సీక్రెట్ ఏజెంట్ గురించి చెప్పే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఆజాద్ హింద్ ఫౌజ్ కు సంబంధించిన గూఢచారిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరిచారు. మొత్తంగా ప్రభాస్ తన పుట్టినరోజు సందర్బంగా నాలుగు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie