SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Fake Accident Scam: రోడ్లపై ఈ తప్పు అస్సలు చేయకండి.. లేదంటే మీరూ ఇలాగే ట్రాప్‌లో పడతారు..!

Fake Accident Scam: ముంబై నగరంలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫేక్ యాక్సిడెంట్ పేరుతో భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు. తనకు జరిగిన చేదు ఘటన గురించి ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 29, 2026, 12:41 PM IST | Updated: Oct 29, 2026, 12:52 PM IST
Image Credit: Fake Accident Scam (Source: AI)
Join

Fake Accident Scam: ట్రాఫిక్‌లో మీరు కారులో వెళుతున్నప్పుడు సడెన్‌గా ఒకరు అడ్డుగా వచ్చి.. 'మీ కారు టైర్ నా కాలిపైకి ఎక్కింది.. ఏం డ్రైవింగ్ చేస్తున్నావ్..?' అంటూ గొడవకు దిగుతాడు. వాడికి తోడు మరి కొందరు కూడా తోడవుతారు. గట్టిగట్టిగా అరుస్తూ.. మీరు ఏ తప్పు చేయకపోయినా చూసే వాళ్లకు నిజంగా టైర్ ఎక్కించాడేమో అన్నట్లు ప్రవర్తిస్తారు. మర్యాదగా డబ్బులు కట్టు అంటూ బెదిరిస్తారు. ఈ అరుపులకు మీరు భయపడి పోతే అంతే సంగతలు.. ఇలాంటి భయాన్ని క్యాష్ చేసుకుంటూ ముంబై మహానగరంలో ఓ కొత్త తరహా మోసం జోరందుకుంది. కారు డ్రైవర్లను బురిడీ కొట్టించి డబ్బులు గుంజుతున్న ఈ ఫేక్ యాక్సిడెంట్ దందా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కార్లలో కుటుంబంతో, చిన్న పిల్లలతో ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ ఓ గ్యాంగ్ రోడ్లపై రెచ్చిపోతుంది. వివరాలు ఇలా..

ముంబైలోని గోరెగావ్‌కు చెందిన శుక్లా అనే వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూలు ముగిసిన తర్వాత తన ఇద్దరు పిల్లలను కారులో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరారు శుక్లా. ట్రాఫిక్‌లో నెమ్మదిగా వెళ్తుండగా..  టూ వీలర్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి కారు అద్దాన్ని తట్టాడు. కారు టైర్ తన కాలిపై నుంచి వెళ్లిపోయిందని.. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నానంటూ గట్టి గట్టిగా అరిచాడు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై జనం గుమిగూడారు. వెనుక సీట్లో ఉన్న పిల్లలు ఆ అరుపులు చూసి పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో శుక్లా ఒత్తిడికి లోనయ్యారు. ఆ బైకర్‌కు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా.. ఇంకా ఫైర్ అయ్యాడు. ఆస్పత్రి ఖర్చులకు వెంటనే డబ్బులివ్వాలని పట్టుబట్టాడు. తన జేబులో నగదు లేదని చెప్పినా వినకుండా.. ఫోన్ తీసి ఆన్‌లైన్ లేదా యూపీఐ ద్వారా డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. చివరకు పిల్లలు మరింత ఏడవడంతో ఈ గొడవ నుంచి బయటపడాలని రూ.1000 ట్రాన్స్‌ఫర్ చేసేశాడు.

కారుతో ఇంటికి చేరిన తర్వాత శుక్లా ప్రశాంతంగా ఆలోచించగా.. ఇది పక్కా ప్లాన్ అని అర్థమైంది. తనకు జరిగిన ఈ చేదు ఘటన గురించి ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అయితే ఆశ్చర్యకరంగా తమకు ముంబై నగరంలో ఇలాంటి అనుభవాలే ఎదురైనట్లు చాలామంది  కామెంట్లలో రాసుకొచ్చారు. వాహనదారులను కంగారు పెట్టి.. ప్రజల మధ్య పరువు తీస్తామని బెదిరించి, భయాన్ని ఆసరాగా చేసుకుని రూ.500 నుంచి రూ.2 వేల వరకు లాగేయడం ఈ ముఠా ప్లాన్ అంటూ కామెంట్లు చేశారు.

ఇలా జాగ్రత్త పడండి..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES