• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈసారి ముందుగానే వేసవి సెలవులు? మార్చి నుంచే హాలిడేస్ లేదా ఆన్‌లైన్ క్లాసులు..!!

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈసారి ముందుగానే వేసవి సెలవులు? మార్చి నుంచే హాలిడేస్ లేదా ఆన్‌లైన్ క్లాసులు..!!

Telangana Early Summer Holidays: తెలంగాణలో రానున్న రోజుల్లో ఎండ తీవ్రతతోపాటు నీటి ఎద్దడి కూడా మరింత తీవ్రం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంతోపాటు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల భానుడు తన ఉగ్రరూపాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written ByBhoomi
Published: Oct 29, 2026, 02:36 PM IST|Updated: Oct 29, 2026, 02:38 PM IST
joinshare
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈసారి ముందుగానే వేసవి సెలవులు? మార్చి నుంచే హాలిడేస్ లేదా ఆన్‌లైన్ క్లాసులు..!!
Image Credit: Telangana Early Summer Holidays

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Uttar Pradesh: కర్వాచౌత్ వేళ కట్టుకున్న భర్త చేతిలో భార్య బలి.. యూపీలో వెలుగులోకి అమానుషం.!.

Uttar Pradesh: కర్వాచౌత్ వేళ కట్టుకున్న భర్త చేతిలో భార్య బలి.. యూపీలో వెలుగులోకి అమానుషం.!.

2

VDA Hike: రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. VDA భారీగా పెంపు.. రోజుకు ఎంతంటే..?

3

Women Life End: 'గేదె' విషయంలో మహిళల వాగ్వాదం.. మహిళా మృతి

4

Konda Surekha: మళ్లీ బీఆర్ఎస్ గూటికి కొండా సురేఖ దంపతులు.. ?.. తెలంగాణ రాజకీయాల్లో సరి కొత్త చర్చ.!.

5

లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులకు అక్టోబర్ 29 నుంచి గోల్డెన్ టైమ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Early Summer Holidays: తెలంగాణలో రానున్న రోజుల్లో ఎండ తీవ్రతతోపాటు నీటి ఎద్దడి కూడా మరింత తీవ్రం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంతోపాటు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల భానుడు తన ఉగ్రరూపాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. ఈ పరిణామాలు పాఠశాలల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. విద్యార్థుల సౌకర్యార్థం ముందుగానే వేసవి సెలవులు ఇచ్చే అంశంపై విద్యాశాఖ.. పాఠశాలల యాజమాన్యాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. 

గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని.. ప్రజలను టెన్షన్ పెడుతున్న అతిపెద్ద సమస్య ఎల్ నినో. వర్షాభావం కారణంగా రానున్న రోజుల్లో తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కునే అవకాశం కూడా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నో సార్లు హెచ్చరికలు జారీ చేశారు. జులై వరకు ఎండల తీవ్రతతోపాటు నీటి ఎద్దడి కూడా పెరిగే ప్రమాదం ఉందని.. అందుకే ప్రజలు ప్రతి బొట్టు నీటిని..విద్యుత్ ను ఎంతో పొదుపుగా వాడుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు చాలా వరకు పడిపోవడం.. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.

ఈ నీటికొరతను ద్రుష్టిలో ఉంచుకుని.. ఎక్కువ నీరు అవసరం అయ్యే వరి సాగును ఈ సీజన్ లో చేపట్టకూడదని..దానికి బదులుగా తక్కువ నీటితోనే పండే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను వేసుకోవాలని మంత్రులు రైతులకు సీఎం విజ్నప్తి చేశారు. మరోవైపు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంటుంది. ముందస్తు ప్రణాళికతో నీటిని, విద్యుత్ ను నిర్వహించుకోవడంతోపాటు ప్రభుత్వ సూచనలను పాటిస్తేనే.. ఈ వేసవి సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రభుత్వం కూడా భావిస్తోంది.

ఇప్పుడు.. ఈ ఎల్ నినో ప్రభావం విద్యార్థులను కూడా ప్రభావితం చేస్తోంది. 'స్లేట్ - ది స్కూల్' వ్యవస్థాపకుడు.. ప్రముఖ విద్యావేత్త అయిన వాసిరెడ్డి అమర్‌నాథ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. ఎల్ నినో వల్ల ఏర్పడిన తీవ్రమైన వేడి, నీటి కొరత కారణంగా ఈ విద్యా సంవత్సరంలో వేసవి సెలవులు ముందుగానే రావడం ఆశ్చర్యకరమేమీ కాదని అన్నారు. బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా భూగర్భ జలాలు ఎండిపోయాయని ఆయన చెప్పారు. అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌కు వర్షాలు తెస్తున్నప్పటికీ, తెలంగాణపై దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. డిసెంబర్ 14 తర్వాత హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని ఆయన ఇంకా తెలిపారు.

నీటి కొరత కారణంగా మార్చి తర్వాత హైదరాబాద్‌లో పాఠశాలలు, విద్యాసంస్థలు నడపడం కష్టమవుతుందా? ప్రభుత్వం ముందుగానే వేసవి సెలవులను ప్రకటిస్తుందా? నాకు తెలియదు. ప్రభుత్వం నుంచి ఇంకా అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. కానీ అలా జరగవచ్చు. సిలబస్‌ను ఎలా పూర్తి చేస్తారనే దానిపై సందేహాలు తలెత్తవచ్చు. నీరు, విద్యుత్ కొరత కారణంగా, మార్చి మొదటి వారంలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం సిఫార్సు చేయవచ్చు. ఆన్‌లైన్ తరగతుల వల్ల పిల్లల చేతుల్లోకి తిరిగి మొబైల్ ఫోన్లు వస్తాయి.  చదువుకునేటప్పుడు వినడానికి వారికి ఏమీ ఉండదు. తమ పిల్లలు మొబైల్ ఫోన్‌లకు బానిసలవుతారని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా పాఠశాల అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది అని వాసిరెడ్డి అమర్‌నాథ్ అన్నారు. ఆన్‌లైన్ తరగతులకు బదులుగా, సిలబస్‌ను పునశ్చరణ చేయడానికి ప్రతిరోజూ అదనపు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు.

కాగా ఇప్పటికే బాసర త్రిపుల్ ఐటీ క్యాంపస్ లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. గోదావరి నుంచి నీటిని తోడే ప్రధాన పంపింగ్ మోటార్లు సడెన్ గా మొరాయించాయి. దీంతోపాటు ఎల్ నినో ప్రభావంతో నీటి మట్టాలు కూడా తగ్గిపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఎదురైంది. క్యాంపస్ లో వేలాది మంది విద్యార్థులకు నిత్యం నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకు యాజమాన్యం ఆన్ లైన్ తరగతులను ప్రారంభించింది.  దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులను ప్రస్తుతానికి ఇంటి వద్దే ఉండాలని అధికారులు కూడా ఆదేశించారు. నవంబర్ 17 నాటికి ఆన్ లైన్ సిలబస్ ను పూర్తి చేసే విధంగా ప్లాన్ రూపొందించారు. విద్యార్థులందరికీ నవంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ను క్యాంపస్ లోనే నేరుగా నిర్వహిస్తామని యాజమాన్యం వెల్లడించింది. ఈ లోగా నీటి సమస్యకు పరిష్కారం చూపి పంపింగ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలను కూడా ముమ్మరం చేశారు.

అయితే, ముందస్తు వేసవి సెలవుల ప్రకటన లేదా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోలేదు. రాబోయే వారాల్లో వాతావరణంలో వచ్చే మార్పులు, ఎల్‌నినో ప్రభావం పాఠశాలల్లో అందుబాటులో ఉండే నీటి వసతులను నిశితంగా పరిశీలించిన పిమ్మటనే విద్యాశాఖ తగిన మార్గదర్శకాలను వెలువరించే అవకాశం ఉంది.

Also Read: 

దోశ పిండిలో చిటికెడు పంచదార కలపడం వెనుక నమ్మలేని క్రేజీ సైన్స్ ఇదే!

 

Add Zee News as a Preferred Source
TAGS:
School Holiday
Telugu News
Telangana News