• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /9000mAh బ్యాటరీతో OnePlus 16.. 200MP కెమెరా, Snapdragon చిప్‌తో అదరగొట్టనుందా?

9000mAh బ్యాటరీతో OnePlus 16.. 200MP కెమెరా, Snapdragon చిప్‌తో అదరగొట్టనుందా?

OnePlus 16: వన్‌ప్లస్ 16 మొబైల్ త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ మొదటగా చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 21, 2026, 04:18 PM IST|Updated: Sep 21, 2026, 04:20 PM IST
joinshare
9000mAh బ్యాటరీతో OnePlus 16.. 200MP కెమెరా, Snapdragon చిప్‌తో అదరగొట్టనుందా?
Image Credit: 9000mAh బ్యాటరీతో OnePlus 16.. 200MP కెమెరా, Snapdragon చిప్‌తో అదరగొట్టనుందా?

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

OnePlus 16 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ మార్కెట్‌లోకి దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ వన్‌ప్లస్ 16 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి.. అవేంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 16 ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న మొబైల్‌ లవర్స్‌కి త్వరలోనే గుడ్‌ న్యూస్‌ రాబోతోంది. దీనిని కంపెనీ అత్యంత తొందరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో ప్రీమియం లుక్‌లో తీసుకు రాబోతోంది. ముఖ్యంగా దీని డిజైన్‌ చాలా ప్రీమియంగా ఉండబోతోంది.

వన్‌ప్లస్ 16 విడుదల తేదీ..
వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌ తేదిని కంపెనీ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనిని కంపెనీ అక్టోబర్‌ మొదటి వారంలో లాంచ్ చేసే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలిపింది. దీనిని కంపెనీ మొదట చైనా మార్కెట్‌లోకి విడుదల చేసి, ఆ తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


వన్‌ప్లస్ 16 రంగు వేరియంట్లు..
వన్‌ప్లస్ 16 మొబైల్‌ను కంపెనీ టుమారోస్ స్టార్‌లైట్‌తో పాటు డార్క్ ఫారెస్ట్, మార్స్ మాస్టర్‌పీస్ అనే మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇందులోని మొదటి కలర్‌ మోడల్‌ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కలర్‌ పగటిపూట ఫోన్ సాధారణంగా కనిపించినా.. రాత్రిపూట మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్ 16 స్పెసిఫికేషన్లు 
ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. వీటిలో చాలా వరకు వివిధ సర్టిఫికేషన్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్, ఈ ఫోన్ విడుదలకు ముందే.. వివిధ స్పెసిఫికేషన్లన్నింటినీ లీక్‌ చేశారు..


వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌ BOE X4 డిస్‌ప్లేతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కూడిన స్క్రీన్‌తో ఇది లాంచ్‌ కాబోతోంది. గేమింగ్‌ ప్రియుల కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం.. ఈ ఫోన్‌లో అడ్రెనో 850 GPUతో పాటు కలర్‌ఓఎస్ 17తో అందుబాటులోకి రాబోతోంది.. వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్ 200MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అదనంగా 50MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉన్నట్లు సమాచారం.. మూడవ సెన్సార్‌గా 50MP పెరిస్కోప్ జూమ్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది.. ఇది మోస్ట్‌ పవర్‌ఫుల్ 9000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా  100W వరకు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌ అవుతుంది.  

Also Read: OPPO A7 Pro ఫోన్‌ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదరగొట్టిన..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News