• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Amazon Saleలో OnePlus Nord 6 ధర ఎంత తగ్గిందో తెలుసా?

Amazon Saleలో OnePlus Nord 6 ధర ఎంత తగ్గిందో తెలుసా?

OnePlus Nord 6: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా OnePlus Nord 6 స్మార్ట్‌ఫోన్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌తో పాటు ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్స్‌లో భాగంగా ఎంత తగ్గింపుతో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 08, 2026, 02:46 PM IST|Updated: Oct 08, 2026, 02:47 PM IST
joinshare
Amazon Saleలో OnePlus Nord 6 ధర ఎంత తగ్గిందో తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
UPI పేమెంట్స్‌పై కేంద్రం వెనకడుగు..? మరిన్ని రోజులు వాయిదా పడే అవకాశం..?

UPI పేమెంట్స్‌పై కేంద్రం వెనకడుగు..? మరిన్ని రోజులు వాయిదా పడే అవకాశం..?

2

Konaseema Politics: కాకినాడలో ఎంపీ సానా సతీష్ వ్యవహారంపై రచ్చ.. సీనియర్ నేతల తీవ్ర అసంతృప్తి..!

3

Madhya Pradesh: భార్యతో కలిసి జూకు వెళ్లిన భర్త.. బైక్ పార్క్ చేసే గ్యాప్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మహిళ.. వీడియో..

4

తెలివైన భార్య..రెండు రాళ్ళ చిక్కుముడి..!!

5

Amazon Saleలో OnePlus Nord 6 ధర ఎంత తగ్గిందో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

OnePlus Nord 6 Discount: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై అద్బుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా శక్తివంతమైన బ్యాటరీతో పాటు అద్బుతమైన గేమింగ్ మొబైల్‌లా గుర్తింపు పొందిన వన్‌ప్లస్ నార్డ్ 6 (OnePlus Nord 6) స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇది బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలుపుకొని ఈ ఫోన్ అత్యంత చీప్‌ ధరకే లభిస్తుండటంతో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ధర ఆఫర్ల వివరాలు..
ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో బ్యాంక్ కార్డు డిస్కౌంట్లతో పాటు కూపన్ ఆఫర్లతో కలిపి రూ.42,500 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.. అంతేకాకుండా క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్‌ లభిస్తోంది.. దీంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) ఆప్షన్‌ కూడా లభిస్తోంది. పాత ఫోన్లపై అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు..
ఈ ఫోన్‌లోని అద్బుతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులో ఎంతో శక్తివంతమైన 9,000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. సాధారణ వినియోగంతో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండున్నర నుంచి మూడు రోజుల వరకు బ్యాకప్ లభిస్తుంది.. దీనికి తోడు 80W సూపర్ ఊక్ (SUPERVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది..

6.78 అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. ఇది 165Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో పాటు 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో గేమింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. తడి వేళ్లతో కూడా సులువుగా పనిచేసే ఆక్వా టచ్ ఫీచర్ కూడా లభిస్తోంది.. ఇది క్వాల్‌కామ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌ పని చేస్తుందని కంపెనీ తెలిపింది. భారీ గ్రాఫిక్స్ గేమ్‌లను సైతం లాగ్ లేకుండా ఆడటానికి 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News