ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!
OnePlus Nord 7: ఎంతో శక్తివంతమైన 9000mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 7 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord 7: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్.. తన పాపులర్ నార్డ్ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ 7 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ అధికారిక ప్రకటనకు ముందే దీనికి సంబంధించిన ఫోటోలతో పాటు కీలక ఫీచర్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్‌కు సంబంధించిన లైవ్ ఫొటోలను షేర్ చేశారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం...
లీక్ అయిన ఫోటోస్ గమనిస్తే.. వన్‌ప్లస్ నార్డ్ 7 డిజైన్‌లో కంపెనీ కొత్త ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నిగనిగలాడే ఫినిషింగ్‌తో పాటు అద్భుతమైన టీల్ గ్రీన్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. పెద్ద కెమెరా మాడ్యూల్‌లో నిలువుగా ఉండడమే కాకుండా రెండు సెన్సార్లు ఉన్నట్లు తెలుస్తోంది.. వాటి పక్కనే ఫ్లాష్, పొడవైన RGB లైట్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తోంది. ఇందులో ప్రత్యేకమైన లైట్ కాల్ అలర్ట్‌లు, నోటిఫికేషన్లు లేదా గేమింగ్ ఎఫెక్ట్‌ల కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ఇక ముందు భాగంలో సన్నని బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లే, మధ్యలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది.
లీక్ ఫీచర్స్ ఇవే..
ఈ ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 9000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. దీనికి తోడు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగ 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన సూపర్ AMOLED డిస్‌ప్లేను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు.. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
నార్డ్ 6తో పోలిస్తే మార్పులు ఇవే..
గత ఏప్రిల్ 2026లో భారత మార్కెట్‌లో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. రాబోయే నార్డ్ 7లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నార్డ్ 6లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండగా.. కొత్త నార్డ్ 7లో డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌ను కూడా వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, 9000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ సపోర్ట్ విషయంలో మాత్రం రెండు ఫోన్లు ఒకేలా ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర, ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించలేదు..