OnePlus Turbo 7 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్.. తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ టర్బో 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తొందరలోనే మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇటీవలే సోషల్ మీడియాలో కూడా లీక్ అయ్యాయి.. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో PYP110 అనే మోడల్ నంబర్‌తో కనిపించిన్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉండబోతుందనే ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
3C సర్టిఫికేషన్ లిస్టింగ్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ టర్బో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది.. గతంలో వచ్చిన వన్‌ప్లస్ టర్బో 6 మోడల్ 80W ఛార్జింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.. కొత్త మోడల్‌లో దీనిని 100W కి అప్‌గ్రేడ్ చేయడం విశేషం.. ఇది వినియోగదారులకు మరింత ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా.. ఈ ఫోన్‌లో కనీసం 9,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఏకంగా 10,000mAh బ్యాటరీ ఉండే అవకాశం కూడా ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. అయితే, 3C సర్టిఫికేషన్‌లో భాగంగా అసలు బ్యాటరీ సామర్థ్యం వివరాలు ఇంకా అధికారికంగా అందుబాటులోకి రాలేదు..
వన్‌ప్లస్ టర్బో 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది 6.78 అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ముఖ్యంగా గేమర్లను ఆకట్టుకునేలా ఇందులో 185Hz అత్యధిక రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తోంది.. ఇది అత్యంత శక్తివంతమైన క్వాల్‌కామ్ 3nm SM8845 ప్రో చిప్‌సెట్‌తో పాటు.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రో ప్రాసెసర్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. వెనక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోందిజ.
అయితే, ఈ ఫోన్ చైనాలోని టర్బో సిరీస్‌లో భాగంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ సంస్థ ఈ ఫోన్ పేరు, పూర్తి స్పెసిఫికేషన్లు, ధరతో పాటు విడుదల తేదీకి సంబంధించిన వివరాలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.. నిజంగానే ఇన్ని అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే.. స్మార్ట్‌ఫోన్ రంగంలో కొత్త సంచలనంగానే మారే అవకాశాలు ఉన్నట్లు టెక్ నిపుణులు భావిస్తూ ఉన్నారు..