SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫోన్‌ వచ్చేస్తోంది.. మరి ఎప్పుడు లాంచ్‌?

Oppo Find X10: త్వరలోనే మార్కెట్‌లోకి Oppo Find X10 స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు Geekbench వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 29, 2026, 12:34 PM IST | Updated: Sep 29, 2026, 12:36 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Oppo Find X10 Latest Update: ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ను ఇప్పటి యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ Oppo కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే త్వరలోనే ఒప్పో ఫైండ్ ఎక్స్10 (Oppo Find X10) మోడల్‌ను కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అనేక వివరాలు Geekbench వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గీక్‌బెంచ్‌ డేటాబేస్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌ గ్లోబల్‌ వేరియంట్‌ మోడల్ నంబర్‌ కూడా ఇప్పటికే నమోదు కూడా చేశారు. అంతేకాకుండా టెస్టింగ్‌ భాగంగా.. ఈ ఫోన్‌ను సింగిల్-కోర్‌తో పాటు మల్టీ-కోర్ స్కోర్‌లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా మల్టీటాస్కింగ్‌తో పాటు హెవీ గ్రాఫిక్స్ గేమింగ్‌ను కూడా సింపుల్‌గా హ్యాండిల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్టఫోన్‌ చైనాలో అందుబాటులో కూడా ఉంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది 12GB ర్యామ్‌తో పాటు 16GB వరకు హై-స్పీడ్ LPDDR ర్యామ్ ఆప్షన్లతో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తాయి. అలాగే ఇది ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది ఆండ్రాయిడ్‌కు సంబంధించిన అద్భుతమైన ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కాబోతున్నట్లు లిస్ట్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా చాలా స్మూత్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

డిస్‌ప్లే, కెమెరా వివరాలు ఇవే..
ఒప్పో ఫైండ్ సిరీస్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు.. అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు Oppo Find X10 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన కెమెరా సెటప్‌తో పాటు ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ హై-ఎండ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లాంచ్‌ కాబోతోంది. దీని వల్ల సులభంగా అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్‌ చేయోచ్చు.. అంతేకాకుండా సినిమాటిక్ 4Kతో పాటు 8K వీడియోలను రికార్డ్ చేయడానికి ఎంతో సులభతరం అవుతుంది..

బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌..
ఈ స్మార్ట్‌ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ ఊక్ (SuperVOOC) అల్ట్రా-ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా రోజంతా నాన్‌స్టాప్‌ బ్యాకప్‌ను అందించేందుకు ఇందులో అద్భుతమైన పెద్ద బ్యాటరీ కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్‌ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్‌లో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే కంపెనీ దీనికి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు అధికారికంగా అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES