SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Oppo Reno 17 సిరీస్ వచ్చేస్తోంది.. నవంబర్ 16న లాంచ్‌? ఫీచర్స్‌ లీక్‌..

Oppo Reno 17: భారత మార్కెట్‌లోకి ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన మోడల్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది నవంబర్ 16న మొదట చైనాలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 09, 2026, 11:55 AM IST | Updated: Nov 09, 2026, 11:57 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Oppo Reno 17: ఒప్పో కంపెనీ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ మార్కెట్‌లోకి ఒప్పో రెనో 17 సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌ మార్కెట్‌లోకి నవంబర్ 16న లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా ఈ సిరీస్‌ మోడల్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా ఇటీవలే లీక్‌ అయ్యాయి. లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది ఒప్పో రెనో 17, ఒప్పో రెనో 17సితో పాటు ఒప్పో రెనో 17 ప్రో పేరుతో విడుదల కాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒప్పో రెనో 17 సిరీస్ విడుదల తేదీ..
ప్రముఖ టిప్‌స్టర్ అన్విన్ ఆన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్ 16న మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇందులో భాగంగా రెండు మోడల్స్ స్పెషిఫికేషన్స్‌ కూడా లీక్‌ చేశారు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫోటోలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కంపెనీ ముందుగా చైనాలో విడుదల చేసి.. ఆ తర్వాత భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఒప్పో రెనో 17 ఫీచర్స్‌ ఇవే..
ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి.. లీక్‌లో భాగంగా ఈ ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌ 6.59-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ప్రాసెసింగ్ కోసం.. ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌ ప్రాసెసర్‌ను తీసుకు రాబోతోంది. దీనితో పాటు 12GB వరకు ర్యామ్‌తో పాటు 512GB వరకు స్టోరేజ్‌ను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

ఒప్పో రెనో 17 ప్రో ఫీచర్స్‌..
ఈ ఒప్పో రెనో 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఎంతో అద్భుతమైన 6.3-అంగుళాల డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది  120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5K OLED డిస్‌ప్లేతో లాంచ్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని లీక్‌ అయిన వివరాలు తెలిపాయి.. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మార్కెట్‌లోకి  12GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ అద్భుతమైన 50MP కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా 7,200mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంచ్‌ కాబోతోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES