• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /iPhone 18, ఐఫోన్ 18e వచ్చేస్తున్నాయ్.. 4430mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Apple ఫోన్లు!

iPhone 18, ఐఫోన్ 18e వచ్చేస్తున్నాయ్.. 4430mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Apple ఫోన్లు!

iPhone 18 సిరీస్‌లో స్టాండర్డ్‌ మోడల్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. వీటిని కంపెనీ ఐఫోన్ 18e, ఐఫోన్ 18 మోడల్స్‌ పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే, వీటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 09, 2026, 02:00 PM IST|Updated: Nov 09, 2026, 02:02 PM IST
joinshare
iPhone 18, ఐఫోన్ 18e వచ్చేస్తున్నాయ్.. 4430mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Apple ఫోన్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
గురు, కుజుల కలయికతో రాజయోగం.. 3 రాశుల ఉద్యోగులకు ప్రమోషన్లు, భారీ లాభాలు!

గురు, కుజుల కలయికతో రాజయోగం.. 3 రాశుల ఉద్యోగులకు ప్రమోషన్లు, భారీ లాభాలు!

2

Chandrababu Rs 500 Denomination: రూ.500 నోట్ల రద్దు చేయాల్సిందే.. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు కీలక డిమాండ్!

3

iPhone 18, ఐఫోన్ 18e వచ్చేస్తున్నాయ్.. 4430mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Apple ఫోన్లు!

4

స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘన విజయం! ఓట్ల శాతంతో మైండ్ బ్లాకింగ్ వివరాలు వెల్లడించిన చంద్రబాబు!

5

నగరంలో ముంచుకొస్తున్న తాగునీటి సమస్య.. మీ ప్రాంతం కూడా ఈ జాబితాలో ఉందా..??

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

iPhone 18: ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్ త్వరలోనే తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది.. ఐఫోన్ 18 సిరీస్‌లోని బేస్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది.. ఈ మోడల్స్‌ను కంపెనీ వచ్చే సంవత్సరం మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు మార్కెట్‌లో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఈ మోడల్స్‌ కూడా గత స్మార్ట్‌ఫోన్స్‌ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి.. ఈ ఐఫోన్ 18తో పాటు అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 18e స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ అద్భుతమైన బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఐఫోన్ 18 ప్రో కంటే స్టాండర్డ్ మోడల్ బ్యాటరీ పెద్దదిగా ఉండే అవకాశం ఉందని లీకైన వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

యాపిల్ కంపెనీ ఐఫోన్ 18 మోడల్‌కు టేకాన్ (V67K) అని.. అలాగే ఐఫోన్ 18e మోడల్‌కు  నెవెరా (V69) అనే కోడ్‌నేమ్‌లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ విషయానికి వస్తే.. ఐఫోన్ 18లో 4430mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గత ఐఫోన్ 17లో ఉన్న 3671mAh బ్యాటరీతో పోలిస్తే.. ఇది ఏకంగా 20 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండడం విశేషం.. రోజంతా హెవీ యూసేజ్ ఉన్నప్పటికీ..  ఛార్జింగ్ సమస్యలు లేకుండా ఉండేలా యాపిల్ ఈ మార్పు చేపడుతున్నట్లు తెలుస్తోంది..

బడ్జెట్ యూజర్లను ఆకట్టుకునేందుకు రాబోతున్న ఐఫోన్ 18e కూడా బ్యాటరీ పరంగా గతంలో విడుదల చేసిన ఐఫోన్ 17e కంటే 10 శాతం పెద్ద బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా 4430mAh బ్యాటరీతోనే అందుబాటులోకి రావడం విశేషం.. ఇక కెమెరా వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 18e వెనుక భాగంలో ఒకే ఒక వైడ్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది..  ఐఫోన్ 18 మోడల్‌లో గతంలో సెన్సార్ రిజల్యూషన్‌ను కొనసాగిస్తూనే... సూపర్ వైడ్, వైడ్ కెమెరాలతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా అందించినట్లు తెలుస్తోంది..

గతంలో లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 18 మోడల్‌లో 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. మల్టీ టాస్కింగ్‌ కోసం ఈ ఫోన్‌ను ఆపిల్ నెక్స్ట్-జెన్  A20 చిప్‌సెట్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. సిగ్నేచర్ డైనమిక్ ఐలాండ్ డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా.. ఈ లైనప్‌లో ఐఫోన్ ఎయిర్ 2 మోడల్‌ను కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News