• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /OPPO Reno 17, Reno 17 Pro వచ్చేశాయ్.. ధర ఎంతంటే? కెమెరా, బ్యాటరీ ఫీచర్లు ఇవే!

OPPO Reno 17, Reno 17 Pro వచ్చేశాయ్.. ధర ఎంతంటే? కెమెరా, బ్యాటరీ ఫీచర్లు ఇవే!

OPPO Reno 17 Series Launched In China: మార్కెట్‌లోకి ఒప్పో రెనో 17 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్‌ చేసింది. అయితే, ఇది వివిధ మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 17, 2026, 11:45 IST|Updated: Nov 17, 2026, 11:46 IST
joinshare
OPPO Reno 17, Reno 17 Pro వచ్చేశాయ్.. ధర ఎంతంటే? కెమెరా, బ్యాటరీ ఫీచర్లు ఇవే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

OPPO Reno 17 Series Launched In China: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఒప్పో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేసేసింది. దీనిని కంపెనీ కంపెనీ ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌తో లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ కంపెనీ సోమవారం చైనాలో అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా స్టాండర్డ్ వేరియంట్  ఒప్పో రెనో 17తో పాటు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కూడిన  ఒప్పో రెనో 17 ప్రో మోడల్‌ను కంపెనీ లాంచ్‌ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్‌లోకి ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6 ట్యాబ్‌ను కూడా లాంచ్‌ చేయడం విశేషం.. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌తో విడుదలైంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రెండు డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్లు సరికొత్త ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఒప్పో రెనో 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.32-అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1,800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నట్లు సమాచారం. స్టాండర్డ్ రెనో 17 మోడల్ 6.56 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో లభిస్తోంది. ఇక ప్రో మోడల్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ ప్రాసెసర్‌తో పాటు స్టాండర్డ్ మోడల్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఈ రెండు ఫోన్లలో అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఒప్పో రెనో 17 ప్రోలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్‌తో పాటు అదనంగా 50MP టెలిఫోటో లెన్స్‌లను కూడా అందిస్తోంది.. రెనో 17 స్టాండర్డ్ మోడల్‌లో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండింటిలోనూ.. 50MP ఫ్రంట్ కెమెరాలను కూడా అందించడం విశేషం.. రెనో 17 మోడల్‌లో కంపెనీ ఏకంగా 8,000 mAh భారీ బ్యాటరీని అందిస్తోంది.. ప్రో మోడల్‌లో 7,250 mAh బ్యాటరీని కూడా అందిస్తూ వస్తోంది. ఈ రెండింటినీ వేగంగా ఛార్జ్ చేసేందుకు 80W వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది.

ఒప్పో రెనో 17 ధరల వివరాల్లోకి వెళితే.. చైనా మార్కెట్‌లో 12GB ర్యామ్‌, 256GB వేరియంట్ ధర CNY 3,799లుగా ఉంది. ఇది భారత మార్కెట్‌లో రూ. 53,600 నుంచి ప్రారంభమవుతుంది. ఇక 12GB ర్యామ్‌తో పాటు 512GB వేరియంట్ ధర CNY 3,999గా ఉంది.. మార్కెట్‌లో రూ. 56,400తో లభిస్తోంది. ఇక 8GB ర్యామ్‌తో పాటు 256GB వేరియంట్ ధర CNY 4,199కాగా.. మార్కెట్‌లో రూ. 59,200 ధరతో లభిస్తోంది. ఇక టాప్ ఎండ్ 12GB ర్యామ్‌తో పాటు 1TB వేరియంట్ ధర CNY 4,899 కాగా.. ఇది భారత కరెన్సీలో రూ. 69,000తో లభిస్తోంది.  ఒప్పో రెనో 17 ప్రో ధరల వివరాల్లోకి వెళితే.. ఇది 8GB ర్యామ్‌తో పాటు 256GB వేరియంట్ CNY 4,199కాగా.. ఇది రూ.59,200)తో లభిస్తోంది. మోడల్‌ను బట్టి ధర అందుబాటులో ఉంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News