Uttar Pradesh: వామ్మో.. పాములకు అడ్డాగా మారిన ఇల్లు.. వందల కొద్ది గుడ్లు, బుసలు కొడుతున్న కోబ్రా పిల్లలు.!.
Snakes found in up: గత ఎనిమిదేళ్లుగా ఆ ఇంట్లో నాగుపాములు తరచుగా బైటపడుతున్నాయి. ఇప్పటికే వందల కొద్ది గుడ్లను కనుగొన్నామని, అనేక చిన్నసర్పాలను పట్టుకుని అడవుల్లో వదిలేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Over 100s of cobra eggs with baby snakes found in uttar Pradesh: ఇటీవల పాములు అడవుల్లో నుంచి జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి. చీకటిగా ఉండే ప్రదేశాల్లో, బూట్లలో , వాహనాల్లో పాములు దూరి ఉంటున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా పాముల కాటుకు గురికావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాములతో నిత్యం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని బాఘ్‌పత్ జిల్లాలోని ఇంట్లో వందల కొద్ది పాములు గుడ్లు , చిన్న పాములు బైటపడుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని బాఘ్‌పత్ జిల్లాలోని కహర్కా గ్రామంలో కపిల్ త్యాగి అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని ఇంట్లో గత కొన్ని నెలలుగా వందల కొద్ది పాముల గుడ్లు, చిన్న పాములు తరచుగా బైటపడుతున్నాయి. దీంతో గ్రామస్తులు ఇతని ఇంట్లో పలు చోట్ల తవ్వకాలు జరిపారు.
ఈ క్రమంలో ఇంటిలో తవ్వకాలు జరిపిన పలు ప్రదేశాల్లో కూడా కోబ్రా గుడ్లు బైటపడ్డాయి. దీంతో కపిల్ త్యాగి తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. వెంటనే కోబ్రాలను పట్టుకునే వారిని రప్పించి పాముల గుడ్లను, పాముల్నిపట్టుకుని అడవుల్లో వదిలేయాలని చెప్పాడు. మరోవైపు ఎన్నిసార్లు వదిలేసిన కూడా మరల పాములు బైటపడుతుండంతో ఆ ఇంట్లోని వారు ఇక లాభంలేదని ఆ ఇంటి నుంచి ఇతర ప్రాంతంకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఘటనలతో తాము తీవ్ర భయాందోళనల్లో ఉంటున్నామని , ఎప్పుడుఎలాంటి ప్రమాదం జరుగుతుందొ అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మంచంపైనే రోజంతా, రాత్రిపూట ఉంటున్నామని బాధితులు చెబుతున్నారు. మరోవైపు ఫారెస్ట్ సిబ్బంది సైతం వారి ఇంటికి వచ్చి కోబ్రా గుడ్లు, చిన్న పాముల్నిచూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆ ఇల్లు పుట్టలు ఉన్న చోట నిర్మించారని, అందుకే పదే పదే పాములు అక్కడకు వచ్చి ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.