• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Ar Rahman: అందర్ని మెప్పించాలంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలి.. రామాయణ మూవీ ట్రోల్స్ పై ఏఆర్ రెహమాన్ సెన్సెషనల్ కామెంట్స్..

Ar Rahman: అందర్ని మెప్పించాలంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలి.. రామాయణ మూవీ ట్రోల్స్ పై ఏఆర్ రెహమాన్ సెన్సెషనల్ కామెంట్స్..

Ramayan movie controversy: రామాయణ మూవీ విడుదలకు ముందే అనేక వివాదాలతో నిత్యం వార్తలలో ఉంటుంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్, సాయి పల్లవిలు రామయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు.ఈ క్రమంలో తాజాగా.. ఏఆర్ రెహమాన్ ఈ మూవీలో పాటకు అందించిన సంగీతం విషయంలో వస్తున్నట్రోల్స్ పై ఘాటు గా స్పందించారు.

Written ByInamdar Paresh
Published: Nov 02, 2026, 03:04 PM IST|Updated: Nov 02, 2026, 03:26 PM IST
joinshare
Ar Rahman: అందర్ని మెప్పించాలంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలి.. రామాయణ మూవీ ట్రోల్స్ పై ఏఆర్ రెహమాన్ సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: ar rahman (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Amit Shah Speech: హైదరాబాద్‌లో అమిత్‌ షా సంచలన ప్రసంగం

Amit Shah Speech: హైదరాబాద్‌లో అమిత్‌ షా సంచలన ప్రసంగం

2

IND Vs NZ Kohli Record: భారత్ Vs న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ రోహిత్-కోహ్లీ రెడీ..వరల్డ్ రికార్డు‌పై కన్నేసిన కింగ్ కోహ్లీ..12 రన్స్ చాలు!

3

YS Jagan: గంజాయి, బెల్టు షాపులే రాప్తాడు ఘటనకు కారణం.. కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

4

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు.. భవిష్యత్తులో పెరుగుతాయా..? తగ్గుతాయా..?

5

IPL Unsold Players: ఐపీఎల్ 2027 వేలంలో స్టార్ ఆటగాళ్లకు షాక్..ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు వేలంలో మొండిచేయి?!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AR Rahman Reacts over Ramayana movie Music Criticism row: బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా  నటిస్తున్న రామాయణ మూవీ తొలి భాగం  దీపావళికి అభిమానుల ముందుకు రానుంది. ఈ మూవీకి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో రామయణ మూవీ విడుదలకు ముందే అనేక వివాదాలతో వార్తలలో ఉంటుంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్ రామయణంపై కోల్ కతాల ఈవెంట్ లో మాట్లాడుతూ నిజం, మంచితనం అంతం అవుతాయని మాట్లాడి వివాదాస్పదంగా మారారు. ఆ తర్వాత సాయి పల్లవి రావణుడు అంత చెడ్డవాడుకాదని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ వ్యాఖ్యలతో రామయణం నటినటులపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. విడుదలకు ముందే ఈ మూవీ నెగెటివ్ ట్రోల్స్ తో నెట్టింట రచ్చ చేస్తుంది. 

మరోవైపు రామాయణ మూవీలోని పాటకు సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ ను సైతం కొంత మంది ట్రోల్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఛావా మూవీ రిలీజ్ వేళ కూడా రెహమాన్ ను సంగీతం సరిగ్గా అందించలేదని తెగ రచ్చ చేశారు. ప్రస్తుతం కూడా రామయణమూవీపై ఏఆర్ రెహమాన్ ఒక పాటకు అందించిన సంగీతం విషయంలో కొంత మంది ఆయన్ను విపరీతంగా ట్రోల్స్ చేశారు. దీనిపై ఏ ఆర్ రెహమాన్ సెటైరికల్ గా స్పందించారు.

అందరినీ సంతృప్తిపరచడం ఎప్పడికి సాధ్యం కాదని మాట్లాడుతూ.. యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన మాటలను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మనం అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే వెళ్లి ఐస్‌క్రీమ్‌ అమ్ముకోండని ఆయన చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఈ సినిమాలోని ‘మంగళ్‌ రంగ్‌’ పాట ఇటీవల విడుదలైంది. దీన్ని అర్జిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌ పాడారు. దీనికి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ పై విపరీతంగా ట్రోలింగ్ చేయడంపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. 

తన సంగీతానికి మొదటి విమర్శకుడిని తానేనంటూ చెప్పుకొచ్చారు. తన అందించిన సంగీతంవెనుకాలవ నెలల తరబడి తపన , ఆలోచన, కృషి ఉంటాయన్నారు. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, కొన్ని పాటలు రోజులు గడుస్తున్న కొలది పాత ఆవకాయ పచ్చడిలా నచ్చుతుందని ఏఆర్ రెహమాన్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు దీపావళికి కానుకగా రామయణ ఐదు భాషల్లో అభిమానుల ముందుకు రానుంది. ప్రస్తుతం రెహమాన్ కామెంట్స్ తో మరోసారి రామాయణ మూవీ వార్తలలో నిలిచింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Telugu News
National News