• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Pakistan Dry Dates Seized: దొంగదారిలో భారత్‌లోకి పాకిస్థాన్ ఎండు ఖర్జూరాలు.."ఆపరేషన్ డీప్ మ్యానిఫెస్ట్" 362 మెట్రిక్ టన్నుల సరుకు సీజ్!

Pakistan Dry Dates Seized: దొంగదారిలో భారత్‌లోకి పాకిస్థాన్ ఎండు ఖర్జూరాలు.."ఆపరేషన్ డీప్ మ్యానిఫెస్ట్" 362 మెట్రిక్ టన్నుల సరుకు సీజ్!

Pakistan Dry Dates Seized: పాకిస్థాన్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి తరలిస్తున్న 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ నుంచి దిగుమతులపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, యూఏఈ ద్వారా నకిలీ పత్రాలు సృష్టించి నాసిక్‌కు చేర్చిన 13 కంటైనర్ల సరుకును అధికారులు సీజ్ చేసి విచారణ వేగవంతం చేశారు.

Written ByHarish Darla
Published: Sep 14, 2026, 07:02 PM IST|Updated: Sep 14, 2026, 07:10 PM IST
joinshare
Pakistan Dry Dates Seized: దొంగదారిలో భారత్‌లోకి పాకిస్థాన్ ఎండు ఖర్జూరాలు.."ఆపరేషన్ డీప్ మ్యానిఫెస్ట్" 362 మెట్రిక్ టన్నుల సరుకు సీజ్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pakistan Dry Dates Seized: పాకిస్థాన్ నుంచి భారత్‌కు ఎండు ఖర్జూరాలు (Dry Dates) దొంగచాటుగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనిఖీలు చేపట్టారు. పాక్ నుంచి దిగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆ దేశానికి చెందిన దాదాపు 362 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాలు మహారాష్ట్రలోని నాసిక్‌కు చేరినట్లు నిఘా వర్గాలు డీఆర్ఐకి సమాచారం అందించాయి. దీంతో నాసిక్‌లోని అంబాడ్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద ముంబయికి చెందిన ఒక సంస్థ దిగుమతి చేసుకున్న 13 కంటైనర్ల ఎండు ఖర్జూరాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

యూఏఈ మార్గంలో నకిలీ పత్రాల సృష్టి..
సదరు ఎండు ఖర్జూరాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి దిగుమతి చేసుకున్నట్లు ముంబయికి చెందిన సదరు సంస్థ పత్రాల్లో పేర్కొంది. అయితే, అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఈ సరుకు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు వెల్లడైంది.

అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ఎండు ఖర్జూరాలను మొదట పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టు నుంచి యూఏఈలోని జెబెల్ అలీ పోర్టుకు తరలించారు. అక్కడ వాటిని మరొక నౌకలోకి లోడ్ చేసి, నకిలీ పత్రాలు సృష్టించి భారత్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ వ్యవహారంలో సదరు కంపెనీపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఉగ్రదాడి నేపథ్యంలో నిషేధం..
పహల్గాంలో గతేడాది జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత కేంద్ర ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది. ఇకపై ఇరుదేశాల మధ్య ఎలాంటి వాణిజ్య సంబంధాలు ఉండబోవని భారత్ స్పష్టం చేసింది.

ఆ నాటి నుంచి పాకిస్థాన్ నుంచి వివిధ మార్గాల్లో జరిగే అక్రమ దిగుమతులను అడ్డుకునేందుకు డీఆర్ఐ అధికారులు 'ఆపరేషన్ డీప్ మ్యానిఫెస్ట్' పేరిట నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల క్రమంలోనే యూఏఈ మీదుగా సాగిన ఈ భారీ ఎండు ఖర్జూరాల అక్రమ రవాణా రాకెట్ బయటపడింది.

Also Read: ఇరాన్‌తో భీకర యుద్ధం వేళ అమెరికాలో మధ్యంతర ఎన్నికలు..ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోతాడా?

Also Read: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం..209 విమానాలపై ప్రభావం, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source