SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రూ. 6,000 పీఎం కిసాన్ ఖాతాలో పడాలా? కొత్తగా ఇలా రిజిస్టర్ చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వం మహిళలు, రైతులు, విద్యార్థుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అయితే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు 23 విడతల నిధులను అందుకున్న రైతులు, ప్రస్తుతం 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మీరు కూడా కొత్తగా పిఎం కిసాన్ యోజనకు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఆ విధానం ఎలాగో తెలుసుకోండి.

Written By Renuka Godugu
Published: Sep 18, 2026, 01:06 PM IST | Updated: Sep 18, 2026, 01:09 PM IST
Image Credit: PM Kisan New Registration 2026
Join

PM Kisan New Registration 2026: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ నిధులు వారి సాగు ఖర్చులకు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇప్పటివరకు 23 విడతల నిధులు మంజూరు చేయగా, 24వ విడత అక్టోబర్ లేదా నవంబర్ మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా రిజిస్టర్ చేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్ దరఖాస్తు విధానం..
ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా డిజిటల్ పద్ధతిలో ఫార్మర్ ఐడిని క్రియేట్ చేయాలి. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలు పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అందుతుంది.

ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో 'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్లి లేదా వసుధ కేంద్రాల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

అర్హతలు..
పీఎం కిసాన్ నిధులు పొందాలంటే సరైన అర్హతలు కలిగి ఉండాలి. ఒకే కుటుంబంలో కేవలం ఒకరు మాత్రమే లబ్ధి పొందుతారు భర్త లేదా భార్య. మైనర్ పిల్లలు కూడా దీనికి అర్హులే. అయితే, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు ఈ పథకానికి అర్హులు కారు.

కావలసిన పత్రాలు..
కొత్తగా రిజిస్టర్ చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, భూ పత్రాలు, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు పాస్‌బుక్‌ను కలిగి ఉండాలి. దీనివల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి.

రిజిస్ట్రేషన్ తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం వస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీ పేరు అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. అక్కడ మీ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తగా దరఖాస్తు చేసిన రైతుల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిస్తే, వారు 24వ విడత నిధులను పొందవచ్చు.

Also Read:​   Atal Pension Yojana: రూ.5,000 పెన్షన్‌ఫై కేబినెట్‌ కీలకనిర్ణయం.. 2031 వరకు గ్యారంటీ!

Also Read:​   Budget 2026: ప్రతి ఏడాది బడ్జెట్‌ ముందు హల్వా వేడుక ఎందుకు జరుపుతారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం

ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే విధానం:
మీరు ఇంటి నుంచే పిఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ 'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్' ఆప్షన్‌ను ఎంచుకుని, మీ రాష్ట్రం, జిల్లా, బ్లా, గ్రామం వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత సర్వే నంబర్ లేదా ఖస్రా నంబర్‌ను ఎంటర్ చేసి, అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. చివరిగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES