నక్సలిజాన్ని అంతం చేసాం.. డ్రగ్స్ మహామ్మారిని నిర్మూలిస్తాం.. ప్రధాని మోడీ శపథం..
PM Modi Emotional News: ఆసియాన్-ఇండియా సదస్సు ముగించుకుని ఫిలిప్పీన్స్ నుండి ఇటీవలే తిరిగి వచ్చిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రిమండలి సమావేశంలో మాదకద్రవ్యాల మహమ్మారిపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. యువతను డ్రగ్స్ బారి నుండి కాపాడాల్సిన అవసరాన్ని వివరిస్తూ గొంతు పూడుకుపోయిందని, నక్సలిజాన్ని తుదముట్టించగలిగినట్లే మాదకద్రవ్యాల సమస్యను కూడా దేశం నుండి పూర్తిగా నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Modi on Drugs: వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి పంజాబ్ యువత మత్తు మందుకు బానిసలు అవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ నియంత్రణ వివాదాస్పదమైన తరుణంలో ప్రధాని వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నక్సలిజాన్ని నిర్మూలించాము.. డ్రగ్స్ పని పడతాము..
దేశంలో నక్సలిజం ముప్పును విజయవంతంగా ఎలా అరికట్టామనే అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల నుండి వేయి మందికి పైగా సిబ్బంది ఉన్న ఒక బెటాలియన్‌ను సీఆర్‌పీఎఫ్ ఉపసంహరించుకుంది. తాజాగా అక్కడి వాల్లను శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం మణిపూర్‌కు పంపింది. గడిచిన మార్చిలో దేశంలో నక్సలిజం అంతమైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఒక సీఏపీఎఫ్ యూనిట్‌ను ఇలా వేరే రాష్ట్రానికి తరలించడం ఇదే ఫస్ట్ టైమ్.
ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో రెండు చారిత్రాత్మక విజయాలపై విస్తృతంగా చర్చించారు. అవి 50 కోట్ల మంది భారతీయులను పేదరిక నుంచి బయటకు తీసుకురావడాన్ని ప్రధానంగా చర్చకు వచ్చింది. అంతేకాదు దేశంలో నక్సలిజం సమస్యను నిర్మూలించడం. హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో సహా వివిధ శాఖలకు చెందిన 11 మంది సీనియర్ కార్యదర్శులు ఈ అంశాలపై సమగ్ర ప్రజెంటేషన్లు ఇచ్చారు. గత సెప్టెంబరులో చింతన్ శిబిర్ పేరుతో జరిగిన భేటీకి కొనసాగింపుగా, ప్రత్యేక పేరేమీ లేకుండా జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే వ్యూహాలపై దృష్టి సారించారు.
నక్సలిజంలో పాటు డ్రగ్స్‌ను దేశం నుండి నిర్మూలిస్తాం..
మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే పేదరిక నిర్మూలన సాధ్యమైందని మంత్రిమండలి ప్రత్యేకంగా తీర్మానం చేసింది. 2011 నుండి 2023 మధ్య కాలంలో ఏకంగా 50 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొన్న విషయాన్ని ఈ భేటీలో ప్రముఖంగా ప్రస్తావించారు. దీనివల్ల దేశంలో తీవ్ర పేదరిక రేటు 90 శాతం మేర తగ్గిందన్నారు. అంటే గతంలో ప్రతి నలుగురు భారతీయులలో ఒకరి కంటే ఎక్కువ మంది పేదరికంలో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ప్రతి 38 మందిలో ఒక్కరికి మాత్రమే పరిమితమైందని గణాంకాలతో సహా వివరించారు.