7500mAh బ్యాటరీతో POCO C95 Pro వచ్చేసింది.. దీని ప్రత్యేకతలివే!
Poco C95 Pro Launched: పోకో సి95 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదలైంది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఇది పెద్ద డిస్ల్పేను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Poco C95 Pro Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ యూజర్స్‌ను దృష్టిలో పెట్టుకుని.. షావోమి అనుబంధ బ్రాండ్ పోకో సరికొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ పోకో C95 ప్రో (Poco C95 Pro) పేరుతో యూరప్, ఆగ్నేయాసియా మార్కెట్లలోకి విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు పెద్ద స్క్రీన్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారీ డిస్‌ప్లే..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని స్క్రీన్ సైజ్ అని టెక్ నిపుణులు తెలుపుతున్నారు.. పోకో C95 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల భారీ ఐపీఎస్ (IPS) డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. స్క్రీన్ బ్రైట్‌నెస్ 825 నిట్స్ వరకు ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ చాలా అద్భుతంగా కనిపిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది..
ఈ మొబైల్ అద్భుతంగా పనిచేసేందుకు ఇందులో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా (MediaTek Helio G91 Ultra) ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. మల్టీటాస్కింగ్ మారేందుకు ఇందులో 8GB వరకు LPDDR4X ర్యామ్‌తో పాటు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉండడమే కాకుండా.. అవసరమైనప్పుడు మొత్తం ర్యామ్‌ను 16GB వరకు పెంచుకునేందుకు అద్భుతమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది..
50MP ఏఐ కెమెరా..
కెమెరా వివరాల్లోకి వస్తే.. పోకో C95 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ AI కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు అద్భుతమైన సెకండరీ సెన్సార్ కూడా లభిస్తోంది. ఇందులో పోర్ట్రెయిట్ షాట్లతో పాటు తక్కువ వెలుతురులో స్పష్టమైన ఫోటోలను తీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.
జంబో బ్యాటరీ..
ఈ ఫోన్‌కు అతిపెద్ద బలం దీని బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో ఏకంగా ఎంతో శక్తివంతమైన 7500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇది రెండు రోజుల కంటే ఎక్కువ బ్యాకప్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు వీలుగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా అందుబాటులో ఉంది..
ధర వివరాలు..
యూరప్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ధరల వివరాల్లోకి వెళితే.. మొదటి వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.21,500లో ఉండబోతోంది. అంతేకాకుండా సెకండ్ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ భారత కరెన్సీలో సుమారు రూ.25,000తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం బ్లాక్, బ్లూతో పాటు గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే.. భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.