• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!

Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!

Dharmapuri News: ఓ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలోనే కరెంట్‌ కోతలు మెండుగా ఉన్నాయి. చాలా రోజుల నుంచి కరెంటు కష్టాలు భరించలేక ఈ రోజు రైతులతో పాటు చందోళి గ్రామస్థులు నిరసనకు దిగారు. అయితే, ఏ నియోజకవర్గంలో ఈ కరెంట్‌ కష్టాలున్నాయో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 03, 2026, 02:11 PM IST|Updated: Oct 03, 2026, 02:12 PM IST
joinshare
Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!

దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!

2

Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!

3

Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

4

IRCTC Current Booking: రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలా? ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా ఛాన్స్ ఉంది! ఎలాగంటే?

5

ప్రైవేట్ జాబ్స్ చేసేవారికి గుడ్ న్యూస్? వేతనంతో కూడిన పితృత్వ సెలవులు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dharmapuri Telugu News: రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడం లేకుండా పోతోంది.. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండల పరిధిలోని చందోళి గ్రామంలో తీవ్ర విద్యుత్ సమస్యలపై నిరసిస్తూ..  గ్రామస్థులు రోడ్డెక్కారు.. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని.. లో-వోల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.

చందోళి గ్రామంలో ప్రతి రోజూ విద్యుత్ కోతలు విధించడంతో పాటు.. సరిపడా వోల్టేజీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రామస్థులతో పాటు రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి, విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనాలు నిలిచిపోయి.. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. అయితే, పోలీసులతో పాటు స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం కూడా చేశారు..

రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న.. ఈ నియోజకవర్గంలోనే ఇలాంటి సమస్యలు రావడం విచారకరమని స్థానికులు మండిపడుతున్నారు. సొంత నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో కనీస విద్యుత్ వసతి కల్పించకపోతే ఎలాగని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నించారు. వేసవి వస్తుడం.. వ్యవసాయ పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్ అంతరాయాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు సైతం వాపోయారు. లో-వోల్టేజీ కారణంగా ఇళ్లలోని ఫ్యాన్లతో పాటు మోటార్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం కారణంగానే రోడ్డెక్కాల్సి వచ్చిందని గ్రామస్థులు వెల్లడించారు. ఇప్పటికైనా.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం తక్షణమే.. జోక్యం చేసుకుని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని.. నిరంతర విద్యుత్‌ను అందించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అధికారులు స్పందించి.. హామీ ఇచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Karimnagar