రూ.20 వేలలోపే POCO X8s 5G ఫోన్.. 50MP కెమెరా, ప్రీమియం డిస్ప్లేతో ఎంట్రీ?
Poco X8s Launch: త్వరలోనే భారత మార్కెట్లోకి పోకో X8s స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఇది రూ.20 వేల లోపే లాంచ్ కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన లీక్ అయిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco X8s Launch News: ప్రస్తుతం మార్కెట్లో మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్లకు అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరల్లో లభించే మొబైల్స్‌ను అందరూ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, తప్పకుండా కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పోకో (POCO) కంపెనీ మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ పోకో X8s (POCO X8s) పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే, ఇందులో ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన కెమెరా వివరాలు..
ఈ పోకో X8s స్మార్‌ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీంతో పాటు తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. ఇవే కాకుండా అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు మాక్రో, డెప్త్ సెన్సార్లు కలిగిన కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో దిమ్మతిరిగే కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రీమియం డిస్ప్లే..
ఈ పోకో X సిరీస్ ఎప్పుడు గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు ప్రాధాన్యతను అందిస్తుందని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పోకో X8s స్మార్ట్‌ఫోన్ కూడా మోస్ట్ పవర్ఫుల్ ఆక్టా-కోర్ 5G చిప్సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్డీ ప్లస్ (FHD+) అమోలెడ్ (AMOLED) లేదా ఐపీఎస్ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
భారీ బ్యాటరీ వివరాలు..
లీక్ అయిన వివరాల ప్రకారం.. రోజంతా వినియోగించేందుకు వీలుగా ఇందులో 5,000mAh కంటే పెద్ద బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జ్ అయ్యేందుకు చాలా ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందుబాటులో ఉంది.. ఇది ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్‌పై ఆధారపడిన కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. భారత మార్కెట్లో దీని ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 ధర మధ్య ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే ఛాన్స్‌లు ఉన్నాయి.