• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

America Gymnastics Coach Sentenced: అమెరికా మిస్సిస్సిప్పిలోని జిమ్నాస్టిక్స్ స్టూడియో బాత్రూమ్‌లో యువతులు బట్టలు మార్చుకునే వీడియోలను వాళ్ల కోచ్ సీన్ గార్డనర్ రికార్డు చేశాడు. ఈ చర్యల కారణంగా సదరు కోచ్‌కు కోర్టులో 90 ఏళ్ల జైలు శిక్ష పడింది.

Written ByHarish Darla
Published: Oct 15, 2026, 02:51 PM IST|Updated: Oct 15, 2026, 02:59 PM IST
joinshare
Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
టీచర్ నుంచి అడ*ల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా.. ఇప్పుడు పేద పిల్లల కోసం స్కూల్ నిర్మాణం!

టీచర్ నుంచి అడ*ల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా.. ఇప్పుడు పేద పిల్లల కోసం స్కూల్ నిర్మాణం!

2

Uttar Pradesh: యూపీలో అమానవీయం.. స్కూల్లో బాలికను కొట్టి, వెంట్రుకలు పీకేసిన టీచర్.. వీడియో..

3

10,000mAh బ్యాటరీతో కొత్త Redmi K100 ఫోన్‌.. ఫీచర్లు లీక్‌!

4

Durga Navratri Puja: దేవీ నవరాత్రుల్లో మూల నక్షత్రం విశిష్టత..?.. రేపు తప్పనిసరి ఏమిచేయాలంటే..?..

5

Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

America Gymnastics Coach Sentenced: అమెరికా క్రీడారంగంలో ఎంతో పేరుపొందిన 39 ఏళ్ల మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ సీన్ గార్డనర్‌కు జైలు శిక్ష పడింది. ముగ్గురు జిమ్నాస్టిక్ బాలికల అశ్లీల చిత్రాలను చిత్రీకరించిన ఆరోపణల నేపథ్యంలో ఫెడరల్ కోర్టు సాధ్యమైనంత గరిష్ట శిక్షను ఖరారు చేసింది. అయితే కోచ్ గార్డనర్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో ముగ్గురు బాలికల ఆశ్లీల చిత్రాలను చిత్రీకరించిన కారణంగా ఒక్కో కారణం చేత 30 ఏళ్ల చొప్పున మొత్తం 90 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలని జడ్జి క్రిస్టీ జాన్సన్ ఆదేశించారు. ఈ సుదీర్ఘమైన శిక్ష అతని జీవిత ఖైదుతో సమానమని భావిస్తున్నారు.

కేసు వెలుగులోకి వచ్చిన తీరు..
డిసెంబర్ 2017 నుండి ఏప్రిల్ 2018 మధ్య కాలంలో అమెరికాలోని మిస్సిస్సిప్పి పర్విస్ నగరంలో ఉన్న జిమ్నాస్టిక్స్ స్టూడియో బాత్రూమ్‌లో కోచ్ గార్డనర్ రహస్య కెమెరాను అమర్చాడు. అక్కడ విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా, బాత్రూమ్ ఉపయోగిస్తుండగా దృశ్యాలను దొంగతనంగా రికార్డ్ చేశాడు.

అయోవా రాష్ట్రంలో చౌస్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న సమయంలో గార్డనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా అతడి కంప్యూటర్లను స్వాధీనం చేసుకోగా, కనీసం 10 మంది మైనర్ బాలికల నగ్న, దుస్తులు విప్పుతున్న వీడియోలు లభ్యమయ్యాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో గత వేసవిలో ఎఫ్‌బీఐ (FBI) గార్డనర్‌ను అరెస్ట్ చేసింది. ఒలింపిక్ ఛాంపియన్ల తయారీకి పేరుగాంచిన కోచ్ లియాంగ్ "చౌ" కియావో స్థాపించిన ఈ సంస్థలో గార్డనర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించేవాడు.

క్రీడా సంస్థల నిర్లక్ష్యంపై విమర్శలు..
గార్డనర్ అక్రమ ప్రవర్తన గురించి 2017లోనే యూఎస్‌ఏ జిమ్నాస్టిక్స్, యూఎస్ సెంటర్ ఫర్ సేఫ్‌స్పోర్ట్ సంస్థలకు ఫిర్యాదులు అందినా.. వారు ఏళ్ల తరబడి ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో 2022లో సేఫ్‌స్పోర్ట్ సస్పెండ్ చేయడంతో చౌస్ సంస్థ అతడిని ఉద్యోగం నుండి తొలగించింది.

సేఫ్‌స్పోర్ట్ నిబంధనల ప్రకారం తమకు సకాలంలో నివేదించడంలో ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం విఫలమైందని తేలింది. ప్రస్తుతం గార్డనర్‌తో పాటు సదరు సంస్థలపై పలు వ్యాజ్యాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News
Telugu News