• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /బ్రిటన్ టీనేజర్ల సరికొత్త ఆలోచన.. రంగులు మారే కండోమ్ వెనుక అసలు కథ ఇదే!

బ్రిటన్ టీనేజర్ల సరికొత్త ఆలోచన.. రంగులు మారే కండోమ్ వెనుక అసలు కథ ఇదే!

Colour Changing Condom: 14 ఏళ్ల వయస్సులో బ్రిటన్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు చేసిన పనిని చూసి ప్రపంచం సైతం ఆశ్చర్యపోతోంది. లైం**గికంగా సంక్రమించే వ్యాధులను గుర్తించేందుకు వీరు రంగులు మారే కండో**మ్స్‌ కనిపేట్టారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 15, 2026, 02:29 PM IST|Updated: Oct 15, 2026, 02:30 PM IST
joinshare
బ్రిటన్ టీనేజర్ల సరికొత్త ఆలోచన.. రంగులు మారే కండోమ్ వెనుక అసలు కథ ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
టీచర్ నుంచి అడ*ల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా.. ఇప్పుడు పేద పిల్లల కోసం స్కూల్ నిర్మాణం!

టీచర్ నుంచి అడ*ల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా.. ఇప్పుడు పేద పిల్లల కోసం స్కూల్ నిర్మాణం!

2

Uttar Pradesh: యూపీలో అమానవీయం.. స్కూల్లో బాలికను కొట్టి, వెంట్రుకలు పీకేసిన టీచర్.. వీడియో..

3

10,000mAh బ్యాటరీతో కొత్త Redmi K100 ఫోన్‌.. ఫీచర్లు లీక్‌!

4

Durga Navratri Puja: దేవీ నవరాత్రుల్లో మూల నక్షత్రం విశిష్టత..?.. రేపు తప్పనిసరి ఏమిచేయాలంటే..?..

5

Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Colour Changing Condom: లైం**గిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేదుకు.. ప్రాణాంతక వ్యాధులను మొదటి దశలోనే గుర్తించేందుకు బ్రిటన్‌కు చెందిన ముగ్గురు స్కూల్‌ విద్యార్థులు ఓ అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు.. లైం**గికంగా సంక్రమించే వ్యాధులు (STIs) సోకినప్పుడు రంగులను మార్చే.. కాండమ్ కాన్సెప్ట్‌ను రూపొందించారు. కేవలం 13, 14 ఏళ్ల వయస్సులోనే.. సమాజానికి ఎంతో అవసరమైన ఇలాంటి కండో**మ్స్‌ డెవలప్‌ చేయడంతో ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రిటన్‌కు చెందిన ముగ్గురు టీనేజర్లు తాము రూపొందించిన ఈ ప్రత్యేక కాన్సెప్ట్‌కు STEYE అని పేరు పెట్టారు.. సాధారణంగా లైం**గిక వ్యాధులను గుర్తించడానికి క్లినికల్ పరీక్షలతో పాటు ల్యాబ్ రిపోర్టులు అవసరమవుతూ ఉంటాయి.. అయితే, ఈ కాండమ్‌ను వాడినప్పుడు అది శరీర ద్రవాల్లో ఉండే బ్యాక్టీరియా లేదా వైరస్‌ల యాంటిబాడీలతో చాలా ప్రత్యేకమైన చర్య జరుపుతుంది.. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అది రసాయన చర్యలతో ఒక్కో రంగులోకి మారుతుందని వారు చెబుతున్నారు..

ఇలా రంగులు మారుతుంది..
కాండమ్ ఆకుపచ్చ రంగులోకి మారినప్పుడు.. క్లామిడియా అనే బ్యాక్టీరియా సంక్రమణను సూచిస్తుందని సమాచారం. అంతేకాకుండా పర్పుల్ రంగులోకి మారినప్పుడు.. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వంటి వైరల్ ఇన్ఫెక్షన్‌లను తెలుపుతుందని వారు వెల్లడించారు.. సిఫిలిస్ వంటి ఇతర వ్యాధులకు కూడా వేర్వేరు రంగులు కేటాయించేలా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది..

చిన్న వయసులోనే ఆరోగ్యంతో పాటు సాంకేతికతను కలిపి చేసిన ఈ ప్రాజెక్ట్‌కు వారికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. వారికి టీన్‌టెక్ అవార్డు (TeenTech Award) లభించడంతో పాటు ప్రసంశలు కూడా లభిస్తున్నాయి.. అయితే, దీనికి ప్రశంసలు లభించినప్పటికీ.. ఇది ప్రస్తుతం క్లినికల్‌ ట్రయాల్స్‌లోనే ఉంది. మార్కెట్లోకి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. వయసులో చిన్నవారైనా.. లైం**గిక ఆరోగ్యం వంటి అంశంపై అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చిన ఈ చిన్నారుల ప్రతిభ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tech News