Poco నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టే ఫీచర్లు!
Poco X8s Launched: ప్రపంచ మార్కెట్‌లోకి పోకో X8s స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ AMOLED ప్యానెల్ డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో లభించబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi సబ్ కంపెనీ Poco స్మార్ట్‌ఫోన్స్‌కి అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరల్లోనే గేమింగ్ మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే మంగళవారం ప్రపంచ వ్యాప్తంగా Poco X8s స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో లాంచ్ అవ్వడం విశేషం.. అంతేకాకుండా ఇది 3500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో AMOLED ప్యానెల్ డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పోకో ఎక్స్8ఎస్ ధర వివరాలు ఇవే..
ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ పోలాండ్‌తో పాటు సింగపూర్ వంటి మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. పోలాండ్‌లో 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ భారత కరెన్సీలో రూ. 38,000తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 43,000తో అందుబాటులో ఉంది.. ఇక సింగపూర్‌లో 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ SGD 619తో లభిస్తోంది. అయితే, ఇది భారత కరెన్సీలో రూ. 45,000కే అందుబాటులో ఉంది. ఇది మార్కెట్‌లో ప్రస్తుతం నీలం, నలుపుతో పాటు తెలుపు అనే మూడు కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది..
పోకో X8s ఫీచర్ల వివరాలు ఇవే..
పోకో X8s స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.35-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఈ వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్ దాని అద్బుతమైన డిస్‌ప్లే ప్యానెల్‌గా భావించవచ్చు.. ఇది 3500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఫోన్ బెజెల్స్ చాలా సన్నగా ఉండటం వల్ల.. ఇది చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.. ప్రాసెసింగ్ కోసం.. ఈ ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది..
పోకో X8s స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన గ్లోబల్ వేరియంట్ ఎంతో శక్తివంతమైన 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని 50MP ప్రధాన కెమెరా లైట్ ఫ్యూజన్ 800 లెన్స్‌తో అందుబాటులో ఉంది.. రెండవది 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా సపోర్ట్‌ను కూడా కలిగి ఉండడం విశేషం.. సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ కోసం.. కంపెనీ ఫ్రంట్ భాగంలో 20MP సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తోంది.. ఈ ఫోన్‌లో అద్భుతమైన బ్యాటరీని కూడా అందిస్తోంది.. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 6330mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం..