Missing BP Dose: హైపర్ టెన్షన్‌తో బాధపడేవారు.. రోజూ అనుకున్న సమయానికే బిపీ మాత్రలు వేసుకోవడం ఎంతో అవసరం. కానీ.. నేటి హడావుడి జీవనశైలిలో చాలామంది తరచూ మందులు వేసుకోవడం మరిచిపోతుంటారు. మరి ఇలా ఒక్క డోసు మిస్ అయితే వెంటనే ఏమైనా ప్రాణాంతక ప్రమాదం జరుగుతుందా? లేదా పదే పదే మాత్రలు వేసుకోవడం నిర్లక్ష్యం చేస్తే గుండె ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది? ఈ విషయాలపై వైద్య నిపుణులు ఇస్తున్న కీలక సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బీపీ మందులను ఒకేసారి వేసుకోవడం మర్చిపోతే..రక్తపోటు తాత్కాలికంగా పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరిలో తలనొప్పి, తలతిరగం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చుంటున్నారు. అయితే లక్షణాలు లేవని రక్తపోటు అదుపులోని ఎట్టిపరిస్థితుల్లోనూ భావించకూడదు.
బీపీ మందులను పదే పదే మిస్ అవ్వడం వల్ల రక్తపోటు నియంత్రణ తప్పుతుంది. దీర్ఘకాలంలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గుండెపోటు, పక్షపాతం, గుండె వైఫల్యం, మూత్రపిండాల సమస్యల ముప్పు పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నా.. చాలా మందికి బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మాత్రలు వేసుకోవడం మర్చిపోయినట్లయితే.. ముందుగా ఆ మందుకు సంబంధించిన సూచనల గురించి పరిశీలించాలి. తదుపరి డోసు సమయం దగ్గరగా ఉంటే మిస్ అయిన మాత్రను వదిలేయాల్సి రావచ్చు. ఒకేసారి రెండు డోసులు అస్సలు వేసుకోకూడదు. ఏం చేయాలనే విషయంలో సందేహం ఉంటే వైద్యుడిని లేదంటే ఫార్మసిస్ట్ ను సంప్రదించాలి. వరుసగా కొన్ని రోజులు మందులు తీసుకోనట్లయితే.. వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
తీవ్రమైన ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, శరీరంలో ఒకవైపు బలహీనత.. చూపులో మార్పులు లేదా మాట్లాడటంలో ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే అత్యవసర వైద్యసాయం తీసుకోవాలి. బీపీ మందులను సొంత నిర్ణయంతో ఆపడం లేదా మోతాదు మార్చడం కూడా ప్రమాదకరం.
Also Read: