• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /2 నెలలుగా అమ్మానాన్నలకు దూరంగా బాలుడు.. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు!

2 నెలలుగా అమ్మానాన్నలకు దూరంగా బాలుడు.. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు!

Jagtial Telugu News: గత 2 నెలల నుంచి తల్లి ప్రేమకు దూరమై శిశు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న బాలుడిని ఎట్టకేలకు అధికారులు నిన్న తల్లిదండ్రులకు అప్పగించారు. మీడియాలో వచ్చిన కథనాలతో పాటు సోషల్ మీడియాలో బాలుడికి సపోర్ట్‌ లభించడంతో అధికారులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 03, 2026, 01:27 PM IST|Updated: Nov 03, 2026, 01:28 PM IST
joinshare
2 నెలలుగా అమ్మానాన్నలకు దూరంగా బాలుడు.. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఏపీ మున్సిపల్ ఫలితాల్లో  క్లీన్ స్వీప్ దిశగా కూటమి..?

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో క్లీన్ స్వీప్ దిశగా కూటమి..?

2

బీపీ మాత్రలు వేసుకోవడం మరిచిపోతున్నారా? ఒక్క డోసు మిస్ అయితే జరిగే ప్రమాదం ఇదే..!!

3

Bihar: ఛీ.. ఛీ.. ప్రియుడితో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన తల్లి.. తమ కామవాంఛకు కొడుకు అడ్డుగా ఉన్నాడని ఘోరం.!.

4

2 నెలలుగా అమ్మానాన్నలకు దూరంగా బాలుడు.. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు!

5

Rajagopal Reddy: క్యారెక్టర్‌లో, క్రెడిబిలిటీలో నేను సీఎంకన్నా ఎక్కువ.. మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jagtial News: గత రెండు నెలలుగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమై.. శివు సంరక్షణ కేంద్రంలో బిక్కబిక్కమంటూ గడిపిన ఓ పసివాడు ఎట్టకేలకు కనవారి వద్దకు చేరుకున్నాడు.. నిబంధనల పేరుతో అధికార యంత్రాంగం చేసిన జాప్యం.. మీడియా కథనాలతో పాటు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు. జిల్లా కలెక్టర్ చొరవతో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో ఈ ఘటన సుఖాంతమైంది. అసలు ఏం జరిగింది? ఈ ఘటకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఈ బాలుడు గత 2 నెలలుగా నిబంధనల ప్రకారం.. శిశు సంరక్షణ కేంద్రంలో పెరుగుతున్నారు.. అయితే.. అమ్మ భయమేస్తోంది... నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..! అంటూ ఆ బాలుడు తన తల్లిని చూసి భయంతో మాట్లాడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చిన్నారి పడుతున్న మానసిక వేదన.. ఆవేదనతో కూడిన ఆ వీడియో ప్రతి ఒక్కరి గుండెలను తాకాయి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో పాటు ప్రజాసంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం, సానుభూతి వ్యక్తం చేస్తూ వచ్చారు.

అయితే, ఈ ఘటనలో ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయి అధికారులు ఆ ప్రక్రియను వేగవంతం చేయడంలో కాస్త వెనక ఉండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. రోజురోజుకూ సంరక్షణ కేంద్రంలో తమ బిడ్డ ఆరోగ్యం దెబ్బతినిందని.. మానసికంగా తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వారు కన్నీరుమున్నీరయ్యారు. న్యాయస్థానం తీర్పు ఉన్నా.. అధికారులు స్పందించకపోవడంపై మీడియా కూడా బాలుడికి సపోర్ట్‌ చేస్తూ.. వరుస కథనాలను ప్రసారం చేసింది..

మీడియాలో వచ్చిన వరుస కథనాలు.. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత జిల్లా అధికార యంత్రాంగాన్ని కదలించేలా చేసింది.. ఈ వ్యవహారంపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పదించింది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని సంబంధిత సంరక్షణ అధికారులను ఆదేశించారు.. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిన్న బాలుడిని అధికారికంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Karimnagar
Telugu News