SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. DJ లాంటి సౌండ్‌తో Portronics కొత్త స్పీకర్ లాంచ్!

Portronics Auratrio Telugu News: భారత మార్కెట్‌లోకి AuraTrio మోడ్యులర్ బ్లూటూత్ స్పీకర్‌ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇది Bluetooth 5.4తో అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 29, 2026, 11:27 AM IST | Updated: Sep 29, 2026, 11:33 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Auratrio Bluetooth Speaker: దేశీయ గ్యాడ్జెట్స్ బ్రాండ్‌లలో పోర్ట్రానిక్స్‌కి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. పోర్ట్రానిక్స్ (Portronics) మార్కెట్లోకి  విడుదల చేసే ఆడియో ప్రొడక్ట్‌కి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇదిలా ఉంటే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు AuraTrio మోడ్యులర్ బ్లూటూత్ స్పీకర్‌ను భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్పీకర్స్ చూడడానికి చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ మూడు వేర్వురు స్పీకర్లుగా విడదీసి కూడా వినియోగించవచ్చని తెలిపింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

3-ఇన్-1 మోడ్యులర్ డిజైన్..
AuraTrio మెయిన్ స్పీకర్‌లో 60W సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా స్పీకర్‌తో పాటు రెండు 15W శాటిలైట్ స్పీకర్లు కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇందులో అద్భుతమైన ప్రీమియం ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే, దీనిని కంపెనీ మూడు స్పీకర్స్‌ను ఒకే చోట ఉంచితే.. ఏకంగా 90W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. వీటిని సులభంగా బాల్కనీలో కూడా ఏర్పాటు చేసుకునే విధంగా అద్బుతమైన డిజైన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ముఖ్యంగా కంపెనీ మెయిన్ యూనిట్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ 100×120mm వూఫర్‌తో పాటు రెండు 45mm ట్వీటర్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా డీప్ బాస్ ఇష్టపడే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా  Bassboost మోడ్ కూడా తీసుకు వచ్చింది. ప్రీమియం బ్లాక్ టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్‌తో పాటు క్యారీ చేయడానికి  ఇందులో ప్రత్యేకంగా హ్యాండిల్‌ను కూడా తీసుకు రావడం విశేషం.

ఈ స్పీకర్‌లో అద్భుతమైన Bluetooth 5.4తో పాటు Auracast టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.. దీంతో పాటు ఎలాంటి ప్రత్యేక యాప్ అవసరం లేకుండానే మెయిన్ స్పీకర్ నుంచి రెండు శాటిలైట్ స్పీకర్లకు ఆడియో వెళ్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే శాటిలైట్ స్పీకర్లను సొంతంగా వేర్వేరు స్పీకర్స్‌తో కూడా కనెక్ట్ చేసుకునేందు స్పెషల్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది.. అలాగే యూఎస్‌బీ (USB)తో పాటు ఆక్స్ (AUX) కనెక్టివిటీతో పాటు ప్రీమియం ఆడియో ప్రాసెసింగ్ కోసం DAC సపోర్ట్ కూడా లభిస్తోంది..

ముఖ్యంగా మెయిన్ స్పీకర్స్‌లో అద్భుతమైన 4,500mAh బ్యాటరీని కూడా అందిస్తోంది. ఒక్కో శాటిలైట్ స్పీకర్‌లో దాదాపు 2,000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలస్తోంది.. కేవలం సింగిల్ ఛార్జ్‌తో సిస్టమ్ దాదాపు 6 గంటల ప్లేటైమ్‌ను కూడా అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. 30W పవర్ డెలివరీ సపోర్ట్ ఉండటంతో టైప్-సి పోర్ట్ ద్వారా వేగంగా ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక Portronics AuraTrio ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రూ.24,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, మార్కెట్‌లో ధర రూ.14,999తో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES