Uttar Pradesh: యూపీలో అమానవీయం.. స్కూల్లో బాలికను కొట్టి, వెంట్రుకలు పీకేసిన టీచర్.. వీడియో..
Up Student hair cut row: మూడో తరగతి బాలిక తనను టీచర్ పదే పదే కొడుతు ఉంటాడని, ఇటీవల తన జుట్టును సైతం పీకేశాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన స్థానికంగా దుమారంగా మారింది.
Private school teacher cuts class 3 girl hair in up: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి మంచి స్కూల్లో వేస్తారు. ఫీజులు ఎంతైన చెల్లించేందుకు వెనుకాడరు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా చూస్తారు. కానీ కొన్ని స్కూళ్లలో టీచర్ లు, సిబ్బంది విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్లొ కొంత మంది టీచర్లు.. పిల్లలతో తమ సపర్యలు చేయించుకొవడం, విద్యార్థినులను లైంగికంగా వేధించడం, వారిపై దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా..ఉత్తర ప్రదేశ్ లోని భదోహి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ లోని భదోహి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సుల్తానపూర్ లో ఉన్న ప్రైవేటు స్కూల్లో అనోఖి అనే బాలికను స్కూల్ టీచర్ ఇష్టమున్నట్లు కొట్టి ఆమె జుట్టును పీకేశాడు. ఈ క్రమంలో బాలిక తనపై జరిగిన దాడిని ఇంటికివ వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వెంటనే తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్ కు చేరుకుని మూడోతరగతి బాలిక అనోఖిపై దాడి ఘటనపై సిబ్బందిని ప్రశ్నించారు. తమకూతురుపై ఉపాధ్యాయుడు మనోజ్ దాడి చేసి, జుట్టును కోసేశాడని ప్రశ్నించగా వారు నెగ్లీజెన్సీగా ప్రవర్తించారు. ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకొండని అన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
దీంతో స్థానిక నేతలు, బాలిక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. తమ కూతురిపై దాడి చేసిన టీచర్ పై, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొవాలని నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసన కారులను నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. స్కూల్ టీచర్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదంగా మారింది. చక్కగా చదువు చెప్పాల్సిన స్కూల్లో విద్యార్థులపై ఈ దాడులు, బెదిరింపుల ధోరణి ఏంటని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.