Rahul Gandhi: బారికెడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే నంటూ డిమాండ్.!. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.!.
India bloc protest in delhi: ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ వరకు ర్యాలీ చేపట్టారు. ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ బలగాలను మోహరించి కార్యకర్తల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Rahul Gandhi climbs barricades in delhi protest: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతుంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు నిరసనలకు దిగారు. పార్ల మెంట్ నుంచి ఎన్నికల సంఘం వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. బారికెడ్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దింపారు. సుమారు 3 వేల మంది వివిధ దళాల పోలీసులతో బందో బస్తు చేపట్టారు.
కేంద్రంకు, కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్ ప్రక్రియలో ఇష్టమున్నట్లు ఓట్లను తొలగించారని ఇండియా కూటమి సీరియస్ అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ కు దిగింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం మార్గంలో పోలీసులు బారికెడ్లను ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పోలీసులను తోసుకుంటూ బారికెడ్లపైకి ఎక్కారు. దీంతో ఒక్కసారిగా ఈసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈక్రమంలో ఆకాశవాణిభవన్ వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లీ కర్జున ఖర్గే రోడ్డుపై బైఠాయించి జాతీయ జెండా పట్టుకుని నిరసనలకు దిగారు. దీంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేశారు.
జ్ఞానేశ్ కుమార్ ఇక చాలంటూ ఫ్లకార్డులను పట్టుకున్నారు. సమాజ్ వాదిపార్టీ నేత అఖిలేష్ యాదవ్ సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఓట్ చోర్ అంటూ అపోసిషన్ పార్టీ నేతల నినాదాలతో ఢిల్లీ అంతా నిరసనలతో దద్దరిల్లింది.