Government Employee Salary Hike: దీపావళి పండగను పురస్కరించుకొని రాజస్థాన్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు, పదవి విరమణ పొందిన మాజీ ఉద్యోగులకు భారీ శుభవార్తను అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కరువు భత్యం, డియర్‌నెస్ రిలీఫ్‌ను మూడు శాతం పెంచుతూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు అర్హులైన సిబ్బందికి దీపావళి అడ్ హాక్ బోనస్ కి కూడా రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అందించింది. పండగ పూట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల కుటుంబాల్లో అద్భుతమైన సంతోషం నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తాజా పెంపుతో రాష్ట్రంలో DA ప్రస్తుతమున్న 60 శాతం నుంచి నేరుగా 63 శాతానికి పెరిగింది. ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు ఈ పెంపు వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగుల తో పాటు.. మరో ఐదు లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ప్రయోజనం లభించబోతోంది. పెరిగిన కరువు బత్యం 2026 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ కూడా స్పష్టం చేసింది..
నవంబర్ నెల జీతంతో కలిపి పెరిగిన డిఏను ఉద్యోగులకు చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే డిసెంబర్ మొదటివారం అంతే జీవితంలో ఈ పెంపు మొత్తం కలిసి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.. ఇక 2026 జూలై ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు నాలుగు నెలల ఎరియర్స్ ఉద్యోగుల జనరల్ ఫ్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు వెల్లడించింది. అలాగే పెన్షనర్లకు జూలై ఒకటో తేదీ నుంచి లెక్కించిన డిఆర్ మొత్తాన్ని పూర్తిగా బ్యాంకు ఖాతాలో జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది..
DA పెంపుతో పాటు రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు దీపావళి ఆడ్ హాక్ బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ బోనస్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.406 కోట్లు వరకు ఇప్పటికే ఆమోదించినట్లు తెలుస్తోంది. అటు డీఏ తో పాటు డిఆర్ పెంపు కారణంగా రూ.820 కోట్లు.. ఇటు బోనస్ కలిపి మొత్తం రూ.1,226 కోట్ల మేర రాజస్థాన్ ప్రభుత్వ ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడబోతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు...
ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma) మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి.. ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులు, పెన్షనర్ల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ప్రభుత్వ ఆశయాలను క్షేత్రస్థాయికి చేరవేసే పాలన యంత్రాంగాన్ని ఆదుకోవడంతోపాటు వారి సంక్షేమానికి పెద్ద పీట వేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతమని ఈ సమయంలో ఆయన తెలిపారు..