Shaik Dastagiri fires on ys Jagan mohan reddy in pulivendula: ఆంధ్ర ప్రదేశ్ లో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు క్యూలైన్ లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కడపలోని పులివెందులలో మాత్రం అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. పలు పోలింగ్ బూత్ లలో వైసీపీ వారిని అనుమించడంలేదని నిరసనలు చేపట్టారు. పోలీసులు దగ్గరుండి మరీ టీడీపీ వారికి సహాకరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పులి వెందుల చేరుకున్నారు. తన కాన్వాయ్ లో వెళ్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది.
పులివెందులలో జగన్ కి ఘోర అవమానం... జగన్ కాన్వాయ్ ని అడ్డుకున్న దస్తగిరి.. నీ బాబాయ్ ని నువ్వే చంపించి, మా జీవితాలు నాశనం చేసావ్ అంటూ, జగన్ ని నిలదీసిన దస్తగిరి.. #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI https://t.co/kWZ2nUgrNI
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) November 1, 2026
వైఎస్ వివేక నందారెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి జగన్ కాన్వాయ్ కు ఎదురుగా వచ్చాడు. అంతే కాకుండా దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాన్వాయ్ కు ముందు వచ్చిన దస్తగిరి సొంత బాబాయ్ వివేకాను చంపించి మా జీవితాలు నాశనం చేశావ్ అంటూ గట్టిగా అరిచాడు.
దీంతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. కొంత మంది దస్తగిరి వచ్చాడని వైఎస్ జగన్ కు చెప్పారు. ఈక్రమంలో జగన్ కుఎదురుగా వెళ్లేందుకు దస్తగిరి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు, భద్రత సిబ్బంది అడ్డుకుని దస్తగిరిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆతర్వాత జగన్ కాన్వాయ్ లో వెళ్తు దస్తగిరి చూసి చూడనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో పులివెందుల రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
ఇక పులివెందులలో జరిగి హింసాత్మక ఘటనలపై జగన్ మండి పడ్డారు. టీడీపీ వారికి పోలీసులు దగ్గరుండి సహాకరించారని మండిపడ్డారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. ఎన్నికల్ని ఏపీచంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అపహస్యం చేసిందన్నారు. చంద్రబాబు సీఎంగా కొనసాగేందుకు నైతిక హక్కులేదన్నారు. పులివెందుల ఎన్నికల్ని రద్దు చేయాలని, రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్వో గారిని కలుస్తామన్నారు.