• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆధార్‌తో రేషన్ కార్డ్ లింక్ చేయకపోతే రేషన్ కట్? ఆన్‌లైన్‌లో ఇలా 2 నిమిషాల్లో పూర్తి చేయండి!

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆధార్‌తో రేషన్ కార్డ్ లింక్ చేయకపోతే రేషన్ కట్? ఆన్‌లైన్‌లో ఇలా 2 నిమిషాల్లో పూర్తి చేయండి!

రేషన్ కార్డును మీ ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే ముందుగా ఆ పని పూర్తి చేయడం చాలా అవసరం. రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మీకు సక్రమంగా అందుతాయి. ఇందుకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కూర్చుని రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయవచ్చు. ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 25, 2026, 01:35 PM IST|Updated: Oct 25, 2026, 01:38 PM IST
joinshare
రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆధార్‌తో రేషన్ కార్డ్ లింక్ చేయకపోతే రేషన్ కట్? ఆన్‌లైన్‌లో ఇలా 2 నిమిషాల్లో పూర్తి చేయండి!
Image Credit: Ration Card Aadhaar Link Online 2026

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హీరోయిన్స్ యాక్షన్ మోడ్..  హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

హీరోయిన్స్ యాక్షన్ మోడ్.. హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

2

విజయ్ టూ సామ్.. అఖిల్ టూ చైతూ ..పెళ్లి తెచ్చిన అదృష్టం..

3

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 28న రాబోతుంది తుఫాను కాదు..తీవ్ర తుఫాను..ఐఎండీ హెచ్చరిక!

4

డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు తెర.. ప్రొబేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని DEOలకు ఆఫీసర్లకు విద్యాశాఖ ఆదేశం..!!

5

Censor Board Data Leak: సెన్సార్‌ బోర్డులో భారీ డేటా లీక్..ఇంటర్నెట్‌లో 500కు పైగా సినిమాల సమాచారం బహిర్గతం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

సాధారణంగా ఆధార్ కార్డులో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు పొందుపరచి ఉంటాయి. అలాగే ఇందులో బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. ఇక రేషన్ కార్డు విషయానికి వస్తే, దీని ద్వారా ప్రతి నెలా పప్పులు, ఉప్పులు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు పొందవచ్చు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం ప్రభుత్వాలు ఈ రేషన్ కార్డు వ్యవస్థను ప్రత్యేకంగా ప్రవేశపెట్టాయి. అందుకే ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేయడం ఎంతో ముఖ్యమైన అంశం. మీరు ఇంకా ఈ అనుసంధానాన్ని పూర్తి చేయకపోతే, వెంటనే ఆ పనిని పూర్తి చేయండి. లేకపోతే బియ్యం, పప్పులు వంటి రేషన్ సరుకులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు కూర్చున్న చోటు నుంచే, మొబైల్ ద్వారా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఆధార్ కార్డును రేషన్ కార్డుతో లింక్ చేసే విధానం..
ముందుగా ఆహార, ప్రజా పంపిణీ శాఖ లేదా PDS అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. అక్కడ "ఆధార్ రేషన్ కార్డు లింక్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. "ఆధార్ సీడింగ్" లేదా "రేషన్ కార్డ్" ఆప్షన్ ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు. అక్కడ మీ రేషన్ కార్డు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, మీ మొబైల్ ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత ప్రతి కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్‌ను, వారి వివరాలను రేషన్ కార్డులో ఉన్న సమాచారంతో సరిచూసి నమోదు చేయాలి. అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ప్రక్రియను పూర్తి చేయండి.

మీ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసినప్పుడు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

అనంతరం మీ ఆధార్, రేషన్ కార్డు వివరాలు వెరిఫై చేయబడతాయి. అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత చివరగా "సబ్మిట్" బటన్‌ను క్లిక్ చేయండి.

సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని భద్రంగా సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.

ఒకవేళ ఆన్‌లైన్‌లో ఈ పని పూర్తి చేయలేకపోతే..
అలాంటి సందర్భంలో, ప్రభుత్వ రేషన్ షాపు లేదా సంబంధిత కార్యాలయ శాఖకు వెళ్ళండి. అక్కడ మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలను అందించి ఆధార్‌ను లింక్ చేయించుకోవచ్చు. ఈ సందర్భంలో సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎంతో ముఖ్యమైనది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసినవారికి మాత్రమే రేషన్ సరుకులు అందుతాయి. కాబట్టి ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేసుకోవడం మంచిది. రిసీట్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే లింకింగ్ పూర్తయినట్టుగా పరిగణిస్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Ration Card
Aadhaar Card
Govt Schemes
Telugu News