SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పండగే.. అక్టోబర్ 15న RedMagic 12 Pro ప్లస్ ఫోన్‌ విడుదల.. మరీ భారత్‌లో?

Redmagic 12 Pro Plus: త్వరలోనే చైనా మార్కెట్‌లోకి RedMagic 12 Pro ప్లస్ ఫోన్‌ విడుదల కాబోతోంది. అయితే, ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ చాలా ప్రత్యేకమైన ఫీచర్స్‌తో విడుదల చేయబోతోంది. అయితే, ఇది భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 29, 2026, 10:31 AM IST | Updated: Sep 29, 2026, 10:34 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Redmagic 12 Pro Plus: నుబియా (Nubia) బ్రాండ్‌కి ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ప్రీచర్స్‌తో ఎప్పటికప్పుడు అద్భుతమైన మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అత్యంత త్వరలోనే మార్కెట్‌లోకి ఒక దిమ్మతిరిగే గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ RedMagic 12 Pro ప్లస్‌ పేరుతో లాంచ్‌ చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక లాంచింగ్‌ తేదిని కూడా ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్భుతమైన డిజైన్.. 
రెడ్‌మ్యాజిక్ విడుదల చేసిన టీజర్‌ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన RGB లైటింగ్‌ సెటప్‌ గేమర్లను ఎంతగానో ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుంగా గేమింగ్‌ ఆడే సమంలో నోటిఫికేషన్స్‌ వచ్చినప్పుడు ఈ లైట్లు చాలా వరకు అద్భుతుమైన వైబ్స్‌ను కూడా అందిస్తాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా తక్కవ బరువు ఉండడం వల్ల పట్టుకోవడానికి కూడా చాలా తేలికగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

అండర్-డిస్‌ప్లే కెమెరా మ్యాజిక్..
ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ చాలా సన్నని బెజెల్స్ అందిచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పంచ్‌ హోల్‌ లేదా నాచ్‌ లేకుండా గేమ్స్‌ ఆడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో కంపెనీ అండర్-డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. దీని వల్ల యూజర్లకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్..
RedMagic 12 Pro ప్లస్‌ మోడల్‌లో కంపెనీ అద్భుతమైన ప్రాసెసర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లు ఆడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు అద్భుతమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించింది. అంతేకాకుండా ప్రత్యేకమైన కూలింగ్ ఫ్యాన్‌ను కూడా తీసుకు రావడం విశేషం.. 12GB ర్యామ్‌తో పాటు 16GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 1TB వరకు భారీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఇది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కంపెనీ ముందుగా చైనా మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయిగే, గతంలో ఈ బ్రాండ్‌కి సంబంధించిన ఫోన్‌లు అందుబాటులో లేవు కాబట్టి.. ఇది కూడా లాంచ్‌ అయ్యే అవకాశాలు లేనట్లు టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: OPPO A7 Pro ఫోన్‌ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదరగొట్టిన..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES