SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

6000mAh బ్యాటరీతో Redmi 17C 5G లాంచ్.. 50MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్స్!

Redmi 17c 5g: భారీ 6000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి అద్భుతమైన రెడ్‌మీ 17C 5G ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Oct 01, 2026, 03:07 PM IST | Updated: Oct 01, 2026, 03:09 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Redmi 17c 5g Launch: బడ్జెట్ విభాగంలో అద్బుతమైన అత్యాధునిక ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ టెక్‌ కంపెనీ రెడ్‌మీ (Redmi) ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే, ఇటీవలే మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రెడ్‌మీ 17C 5G (Redmi 17C 5G) పేరుతో లాంచ్‌ అయ్యింది. ఇది ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, భారీ 6000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డిస్‌ప్లేతో పాటు డిజైన్..
రెడ్‌మీ 17C 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన లుక్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇందులో వీడియోతో పాటు గేమింగ్‌ అనుభవాన్ని మరింత స్మూత్గా మార్చేందుకు హై-రీఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన పెద్ద డిస్‌ప్లేను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. అంతేకాకుండా చేతిలో పట్టుకోవడానికి ఫుల్ గ్రిప్‌ను అందించేందుకు ఈ ఫోన్‌ను అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చారు.

కెమెరా ఫీచర్స్‌, స్పెషిఫికేషన్ వివరాలు..
రెడ్‌మీ 17C 5G మొబైల్‌ ఫోటోగ్రఫీ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 50 మెగాపిక్సెల్  ప్రధాన కెమెరాను కూడా అందించారు. అంతేకాకుండా ఏఐ (AI) సపోర్ట్‌తో కూడిన ఈ లెన్స్ తక్కువ వెలుతురులో సైతం స్పష్టమైన ఫోటోలను అద్బుతంగా తీస్తుంది. పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్‌తో పాటు హెచ్‌డీఆర్ (HDR) వంటి చాలా ప్రత్యేకమైన కెమెరా ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో భాగంలో చాలా అద్బుతమైన ఫ్రంట్ కెమెరాను కూడా తీసుకు వచ్చారు. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 6000mAh భారీ బ్యాటరీని అందించారు. సాధారణంగా దీనిని వినియోగిస్తే.. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు సులభంగా బ్యాకప్ అందిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన ఫాస్ట్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.

ప్రాసెసర్ వివరాలు..
Redmi 17C 5G స్మార్ట్‌ఫోన్‌లో మల్టీటాస్కింగ్, అద్భుతమైన 5G ప్రాసెసర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.. ఇది వేగవంతమైన డౌన్‌లోడ్స్‌తో పాటు బఫర్ లేకుండా స్ట్రీమింగ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇవే కాకుండా యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఆండ్రాయిడ్ వెర్షన్‌పై ఈ ఫోన్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ 5G, వైఫై, బ్లూటూత్‌తో పాటు సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES