• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /200MP కెమెరా.. 10,000mAh బ్యాటరీ.. Redmi K100 Ultra ఫీచర్లు లీక్!

200MP కెమెరా.. 10,000mAh బ్యాటరీ.. Redmi K100 Ultra ఫీచర్లు లీక్!

Redmi K100 Ultra Leaks: మార్కెట్‌లోకి రెడ్‌మి K100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 12:35 PM IST|Updated: Nov 13, 2026, 12:37 PM IST
joinshare
200MP కెమెరా.. 10,000mAh బ్యాటరీ.. Redmi K100 Ultra ఫీచర్లు లీక్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
డిసెంబర్‌లో iQOO 16R లాంచ్.. 10,000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్!

డిసెంబర్‌లో iQOO 16R లాంచ్.. 10,000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్!

2

200MP కెమెరా.. 10,000mAh బ్యాటరీ.. Redmi K100 Ultra ఫీచర్లు లీక్!

3

కేవలం 10 నిమిషాల్లో ముఖం మెరిసిపోవాలంటే.. బీట్‌రూట్‌తో ఇలాంటి సింపుల్ ఫేస్‌ప్యాక్ వేయండి!

4

India Vs New Zealand Highlights: టీమిండియా చెత్త బ్యాటింగ్.. మొదటి ఓవర్లోనే ముగ్గురు డకౌట్..!

5

వామ్మె.. ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా చిరుత ఎంట్రీ.. ఏం చేశారో చూడండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Redmi K100 Ultra Leaks: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మి.. తమ K100 సిరీస్‌ నుంచి మరొన్ని మోడల్స్‌ అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు నాలుగో వేరియంట్‌గా రెడ్‌మి K100 అల్ట్రాను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కొత్త అల్ట్రా మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రముఖ టిప్‌స్టర్లు దేబయన్ రాయ్‌తో పాటు డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియాలో అందుబాటులోకి తీసుకు వచ్చిన వివరాల ప్రకారం.. షియోమి ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరీక్షిస్తోందట.. సిరీస్‌లోని ప్రో మోడల్స్ కంటే ఇందులో ఎన్నో రకాల మోడల్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో హై-రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 2K OLED డిస్‌ప్లేతో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

పర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో  ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. బ్యాక్‌ సెటప్‌లో 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఏకంగా ఇది ఎంతో శక్తివంతమైన 10,000mAh భారీ బ్యాటరీనికి కలిగి ఉంటుంది.. ఇది 100W వైర్డ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.. ఆగస్టులో చైనాలో విడుదలైన రెడ్‌మి K100 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ ఇప్పటికే వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..

ఈ K100 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.59-అంగుళాల, ప్రో మాక్స్‌లో 6.9-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇవి 185Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 4,800Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా డ్యూయల్ సిమ్ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌లతో లభిస్తోంది.

ఈ రెండు మోడల్స్‌లో ఎంతో శక్తివంతమైన 200MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50MP టెలిఫోటో లెన్స్‌తో పాటు సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. అయితే, ప్రో మోడల్‌లో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రో మాక్స్‌లో 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News