Beetroot for Skin: స్కిన్ కేర్ రొటీన్ అనేది కాలానికి అనుగుణంగా మారాలి. బయటి ఉత్పత్తులు ఏవీ ఉపయోగించకుండానే ఇంట్లో ఉండే వస్తువులతో కూడా చర్మాన్ని మెరిపించవచ్చు. ఇవి చర్మంపై ఉండే ట్యాన్ పోగోట్టడమే కాదు.. మంచి పునరుజ్జీవనం కూడా అందిస్తుంది. మీ చర్మ రంగు కూడా మెరుగుపడుతుంది. బీట్ రూట్ ఫేస్‌ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి? మీరు కూడా తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు..
పసుపు, శనగపిండి, నిమ్మరసం, కాఫీ పౌడర్, చక్కెర, కొబ్బరినూనె, ఓట్మీల్, నీరు, బీట్‌రూట్ పొడి, ఆరెంజ్ తొక్క పొడి, ముల్తానీ మిట్టీ, రోజ్ పెటల్ పౌడర్, రోజ్ వాటర్, కలబంద జెల్, గ్లిజరిన్.
తయారు చేసుకోవాల్సిన విధానం..
ఈ బీట్‌రూట్ ఫేస ప్యాక్ రెడీ చేయాలంటే ఒక టీ స్పూన్ బీట్‌రూట్ పొడి, ఆరెంజ్, రోజ్ పెటల్, శనగపిండి, రోజ్ వాటర్ పొడి కలపాలి. దీన్ని మంచి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఈ బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌ను ముఖం, మెడ భాగంలో అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత ముఖం సాధారణ నీటితో కడగాలి. దీంతో మీ చర్మం మెరిసిపోవడం మాత్రమే కాదు.. పునరుజ్జీవనం కూడా లభిస్తుంది.
బీట్‌రూట్ ప్యాక్ బెనిఫిట్స్..
బీట్‌రూట్, ఆరెంజ్ పీల్ పొడితో చర్మానికి మంచి తాజాదనం కూడా లభిస్తుంది. ముల్తానీ మిట్టి ముఖంపై ఉండే అదనపు నూనెను గ్రహిస్తుంది. మలినాలను కూడా తొలగించి కాంతివంతం చేస్తుంది. రోజ్ వాటర్ వల్ల మన చర్మానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ వారానికి రెండు సార్లు ఉపయోగించండి. అయితే, ఏదైనా కొత్త ఉత్పత్తులు ఉపయోగిస్తే ముందుగానే ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందులో వాడిన ఉత్పత్తులు సహజమైనవి కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మచ్చ లేకుండా కాంతివంతంగా మారుతుంది. ఇందులో మనం వాడిన ఉత్పత్తుల సహాయంతో కూడా మచ్చ లేకుండా పొందవచ్చు.
శనగపిండి అనేది మన బామ్మల కాలంనాటి నుంచి ఉపయోగిస్తున్న రెమిడీ. దీంతో మీ చర్మానికి హైడ్రేషన్ కూడా లభిస్తుంది. కాంతివంతగా మారుతుంది. ఇందులో కేవలం పాలు లేదా రోజ్ వాటర్ కూడా ఉపయోగించి ముఖానికి రాయడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)