నవంబర్ 1 నుంచి భారీ మార్పులు.. నాన్-BS6 వాహనాలపై బ్యాన్, మారనున్న LPG గ్యాస్ ధరలు.. కాలర్ ID కొత్త రూల్!
అక్టోబర్ నెల ముగింపు దశకు చేరుకుంది, నవంబర్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ కొత్త నెలలో కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు జరుగుతుంది. దీంతో పాటు మరికొన్ని మార్పులు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా నాన్ బిఎస్6 వాహనాలు, కాలర్ ఐడీ ఫీచర్లలో కొన్ని మార్పులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవడం అవసరం. ఇవి సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Rules Changing From November 1, 2026: ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూనే ఉంటాయి. దీంతో పాటు బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఈ విషయాలను తెలుసుకోవడం మంచిది. నవంబర్ ఒకటో తేదీ కూడా త్వరలోనే రానుంది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ , గ్యాస్ ధరల్లో మార్పులు జరుగుతాయి. ఇవే కాకుండా మరికొన్ని మార్పులు కూడా వస్తాయి. నవంబర్ ఒకటో తేదీన కూడా ఇలాంటి కొన్ని మార్పులు జరగనున్నాయి. ఇవి సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడం ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ, రవాణాకు సంబంధించిన జాతీయ నిబంధనల్లో కూడా కొన్ని మార్పులు చేసింది. అవి నవంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా థర్డ్ పార్టీ అప్లికేషన్ కాల్స్, కాలుష్య నివారణ కోసం దేశ రాజధానిలో నాన్ బిఎస్6 వాహనాలపై నిషేధం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, నవంబర్ ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నాన్ బిఎస్6 వాహనాలు..
నాన్ బిఎస్6 వాహనాలు అంటే కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు మరింత కఠినమైన ప్రమాణాలు పాటించేవి. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక నియమాలను అమల్లోకి తీసుకువచ్చారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి 2027 జనవరి 31 వరకు నాన్ బిఎస్6 వాహనాలను రాజధానిలోకి అనుమతించరు. కేవలం బిఎస్6 ప్రమాణాలు కలిగిన, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలకు మాత్రమే రోడ్లపై అనుమతి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించనున్నారు.
కాలర్ ఐడీ ఫీచర్...
ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నారు. దీంతో ఇప్పటికీ అనేక ఫ్రాడ్ కాల్స్, స్పామ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కీలక చర్య తీసుకుంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి కాలర్ ఐడీ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇది 4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో కూడా పనిచేస్తుంది. దీని ద్వారా తెలియని కాలర్లను గుర్తించవచ్చు. ఇందుకోసం ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బిజీగా ఉన్న సమయాల్లో కూడా స్పామ్, మోసపూరిత కాల్స్ బారిన పడకుండా ఈ కొత్త ఫీచర్ సహాయపడుతుంది.
Read Also: ఆధార్‌కు ఈమెయిల్ ఐడీని ఉచితంగా ఎలా లింక్ చేయాలి? డిసెంబర్ 31లోపు మొబైల్‌లోనే ఇలా చేసేయండి!
ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ధరలు..
ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ధరలను ప్రతి నెల సవరిస్తుంటారు. నవంబర్ ఒకటో తేదీన కూడా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు గృహ, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా విమానయాన ఇంధన ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో కూడా మార్పులు ఉండవచ్చు. దీని ప్రభావం సాధారణ ప్రజలపై కూడా పడనుంది.