• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..

అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..

Cyclone Effect on Telangana: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రమే కాదు.. ఏపీ ని ఆనుకొని ఉన్న జిల్లాల్లో పెద్ద ప్రభావమే చూపించనుంది. తుపాను ప్రభావంతో ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నట్టు అధికారులు తెలిపారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 08:39 AM IST|Updated: Oct 25, 2026, 08:41 AM IST
joinshare
అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..
Image Credit: Telangana Toofan Effect (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!

కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!

2

ఆల్ టైమ్ నుంచి 26శాతం పడిపోయిన బంగారం ధర.. కొనేందుకు ఇదే సరైన సమయమా..??

3

అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..

4

నీళ్లు లేక మూతపడ్డ బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్.. నవంబర్ 17 వరకు దసరా సెలవులు పొడిగింపు!

5

3 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో అలర్ట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Weather Update on Telangana: అర్నబ్ తుపాను వాయుగుండంగా మారి ఈ నెల 28న తుపానుగా రూపాంతరం చెందనుంది. అంతేకాదు విశాఖ పట్నం బాపట్ల మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడం,  ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

భారీ వర్షాలు.. 
మరోవైపు వరంగల్, మహబూబా బాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యపేట, నల్గొండ జిల్లాల్లో  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురవనున్నాయి.

ఎల్ నినో ప్రభావం.. 

మొత్తంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్‌లలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాల సీజన్‌లో కావాల్సిన వర్షపాతం కంటే తక్కువే నమోదు అయింది. ఎల్‌నినో ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో సరైన మోతాదులో పంటలు పండకపోవడంతో బియ్యం ఇతర నిత్యావసర సరుకులు ధరలకు రెక్కలు వచ్చాయి. అంతేకాదు ఎల్‌నినో ప్రభావంతో చాలా చోట్ల చెరువులు, బోర్లు ఎండిపోయాయి. ఈ సారి బతుకమ్మ పండగకు చాలా చోట్ల కుంటల్లో చెరువుల్లో నీళ్లు పరిస్థితి చూసాము. ఈ నేపథ్యంలో అర్నబ్ తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరాల వర్షాలు కురిస్తే భూగర్భ జలమట్టాలతో పాటు చెరువులు, కుంటలు నిండే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ రకంగా కొద్దిలో కొద్దిగా కరువును ఎదర్కోవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్లో 16.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు తుపాను ప్రభావంతో పాటు  రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని  అధికారులు తెలుపుతున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Weather Update
AP Weather