SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Russia Woman love Story: అదంతా ఫెక్.. రష్యా యువతి ప్రేమాయణంలో వెలుగులోకి అసలు నిజం.!.

Russia woman viral love story: సోషల్ మీడియాలో రష్యాకు చెందిన యువతి, బీహర్ కు చెందిన రాహుల్ ను ఇష్టపడి వచ్చిందని పెళ్లికి కూడా రెడీ అయిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీనిపై తాజాగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

Written By Inamdar Paresh
Published: Oct 14, 2026, 04:46 PM IST | Updated: Oct 14, 2026, 04:55 PM IST
Image Credit: Russia girl in bihar news
Join

Russian woman and bihar man viral love story actual fact: సోషల్ మీడియాలో ఇటీవల చాలా మంది నెటిజన్లు వ్యూస్ లు,  లైక్ ల కోసం తెగ పాకులాడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే  వైరల్ చేస్తున్నారు. అసలు జరిగిన ఘటన నిజమా లేదా కనీసం క్రాస్ చెక్ కూడా చేసుకొకుండా దాన్ని వైరల్ చేస్తున్నారు. కొన్నిసార్లు అసత్య ప్రచారాలు సైతం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. బీహర్ లోని యువకుడిని పెళ్లాడటం కోసం రష్యాకు చెందిన యువతి వచ్చిందని వార్తలు తెగ వైరల్ గా మారాయి. తాజాగా.. దీనిలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

 

రష్యాకు చెందిన జూలీ అనే యువతి బీహర్ లోని బాగల్ పూర్ కు చెందిన రాహుల్ యాదవ్ కోసం వచ్చిందని వార్తలు తెగ వైరల్గా మారాయి. ఈ క్రమంలో రాహుల్ బీహర్ కు వెళ్లినప్పుడు వీరిమధ్య ప్రేమ చిగురించిందని ఇటీవల రాహుల్ బీహర్ కు వచ్చేయడంతో ఉండబట్టలేక జూలి వచ్చేసిందని వార్తలు ప్రచారం చేశారు. కొంత మంది వీరి పెళ్లి నవంబర్ లో జరుగుతుందని కూడా ప్రచారం చేశారు. అయితే.. దీనిపై అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

రష్యా నుంచి బీహర్ కు వచ్చిన  వచ్చిన వారంతా ఎన్జీవో గ్యాంగ్ అంతా ఒక ప్రభుత్వేతర బృందంతో కూడిన వారని విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా రాహుల్ అని చెప్తున్న వ్యక్తి పేరు కూడా.. నమిత్ భయ్ అని వెలుగులోకి వచ్చింది. 

ఈ సంస్థ ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధించి, వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడటంలో పాటుపడతారని సమాచారం. అయితే..వారంతా బీహర్ లోని వివిధ ప్రాంతాలను సంచరిస్తు అక్కడి మహిళలతో మాట్లాడుతూ, వారికి ఎలాంటి మద్దతు ఇస్తే  బాగుంటుందో మాట్లారని అక్కడి వారు చెబుతున్నారు.

 కానీ ఈ విషయంను కొంత మంది సైడ్ ట్రాక్ చేసి సదరు యువతి బీహర్ యువకుడితో పెళ్లికి రెడీ అయ్యిందని వార్తలను ప్రచారం చేశారు. ఈ క్రమంలో తాజాగా.. అసలు నిజం వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES