• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Muskan Rastogi: భర్త బ్లూడ్రమ్ము హత్య కేసులో సంచలనం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష!

Muskan Rastogi: భర్త బ్లూడ్రమ్ము హత్య కేసులో సంచలనం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష!

Death Penalty For Muskan Rastogi And Sahil Shukla In Meerut Blue Drum Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్తను బ్లూడ్రమ్ములో హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష వేస్తూ మీరట్‌ కోర్టు తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 14, 2026, 06:16 PM IST|Updated: Oct 14, 2026, 06:20 PM IST
joinshare
Muskan Rastogi: భర్త బ్లూడ్రమ్ము హత్య కేసులో సంచలనం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష!
Image Credit: Blue Drum Case Death Penalty

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Botsa Anusha: విజయనగరం జడ్పీ ఫైట్.. చిన్న శ్రీనుకు బొత్స మార్క్ చెక్.. రంగంలోకి బొత్స అనూష..?

Botsa Anusha: విజయనగరం జడ్పీ ఫైట్.. చిన్న శ్రీనుకు బొత్స మార్క్ చెక్.. రంగంలోకి బొత్స అనూష..?

2

జీ5లో గ్రాండ్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. సీత పాత్రపై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

3

అధిక కొవ్వు ఉన్న అవకాడో సూపర్ ఫుడ్‌గా ఎలా మారింది? హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న 5 నిజాలు!

4

Muskan Rastogi: భర్త బ్లూడ్రమ్ము హత్య కేసులో సంచలనం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష!

5

‘జైలర్ 2’ ప్రీ రివ్యూ.. తలైవా ఫ్యాన్స్ లుంగీ డాన్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Blue Drum Murder Case: కట్టుకున్న భర్త ఉండగానే ప్రియుడితో వివాహేతర సంబంధం నడిపిస్తున్న భార్య.. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బ్లూడ్రమ్ములో నింపిసేంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో తాజాగా హతుడి భార్య, ఆమె ప్రియుడికి న్యాయస్థానం ఉరిశిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. మీరట్‌ కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి.

4 మార్చి 2025న మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య ముస్కాన్‌ రస్తోగి తన ప్రియుడు సాహిల్‌ శుక్లాతో కలిసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్‌ శరీరాన్ని ముక్కలుగా చేసి.. ఆ అవశేషాలను సిమెంట్ నింపిన ఒక నీలం రంగు డ్రమ్‌లో దాచిపెట్టడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. బ్లూ డ్రమ్ హత్య కేసులో వారిద్దరికీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కోర్టు బుధవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నేరం జరిగిన రెండేళ్ల తర్వాత మీటర్‌ జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా తీర్పును వెలువరించారు. విచారణ సందర్భంగా జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. శిక్ష అనేది కూడా ధర్మంలో ఒక భాగమని చెబుతూ మహాభారతాన్ని ప్రస్తావించారు.

కోర్టులో విచారణకు ముస్కాన్‌ రస్తోగి, సాహిల్ శుక్లా ఇద్దరూ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవగా.. హతుడు సౌరభ్ తల్లి రేణు రాజ్‌పుత్, అతడి సోదరుడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. భార్యాభర్తలు కలిసి జీవించడం ఇష్టం లేకపోతే హింసకు పాల్పడకుండా విడిపోవాలని సౌరభ్‌ తల్లి విజ్ఞప్తి చేశారు. కలిసి జీవించడం ఇష్టం లేకపోతే ప్రశాంతంగా విడిపోవాలని సూచించారు. కానీ ఒకరి బిడ్డను చంపకండి అని ప్రాధేయపడ్డారు. 'నా కొడుకు ఎక్కడకు వెళ్లలేదు. మా ఇంటి ప్రతి మూలలో అతడి జ్ఞాపకాలు ఉన్నాయి' అని చెప్పి సౌరభ్‌ తల్లి రేణు రాజ్‌పుత్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

విశేషమేమిటంటే భర్తను చంపిన ముస్కాన్ రస్తోగి తల్లిదండ్రులు ఆమెకు వ్యతిరేకంగా నిలబడ్డారు. తమ కుమార్తెకు మరణశిక్ష విధిస్తే తాము వ్యతిరేకించబోమని న్యాయస్థానానికి చెప్పడం విశేషం. ముస్కాన్‌, సౌరభ్ కుటుంబాలు ఆ ఇద్దరికి మరణశిక్ష విధించాలని కోరాయి.

ఇంతకీ ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ను ముస్కాన్‌ రస్తోగి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 2016లో వీరి వివాహం జరగ్గా సౌరభ్‌ ఉద్యోగం వదిలిపెట్టడంతో కాపురంలో కలహాలు మొదలయ్యాయి. అయితే తరచూ సౌరభ్​ స్నేహితుడు సాహిల్‌ శుక్లా ఇంటికి వస్తుండడంతో అతడితో ముస్కాన్​ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఇప్పటికే గొడవలు జరుగుతుండగా.. భార్య తన స్నేహితుడితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో సౌరభ్‌ తీవ్రంగా భావించాడు. భార్యను నిలదీసి.. అతడితో దూరంగా ఉండాలని సూచించాడు. ఈ విషయాన్ని సాహిల్‌ శుక్లాకు చెప్పగా తమ ఇద్దరి వివాహేతర సంబంధానికి సౌరభ్‌ రాజ్‌పుత్‌ అడ్డుగా ఉన్నాడని భావించాడు. అతడి అడ్డు తొలగించుకోవాలని భావించి భార్య ముస్కాన్‌ తన ప్రియుడితో కలిసి భారీ కుట్ర చేసింది. 

భర్తకు వడ్డించిన భోజనంలో నిద్ర మాత్రలు కలిపి భార్య ముస్కాన్‌ పెట్టింది. అనంతరం భర్త నిద్రమత్తులోకి జారుకున్నాడు. అనంతరం ప్రియుడితో కలిసి తన భర్త సౌరభ్‌ను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత మరింత దారుణంగా సౌరభ్‌ మృతదేహాన్ని వారిద్దరూ కలిసి 15 ముక్కలుగా కోశారు. ఆ ముక్కలున ప్లాస్టిక్‌ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పిపెట్టారు. ఆ తర్వాత వారిద్దరూ మనాలీ పారిపోయారు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సౌరభ్‌ ఫోన్‌ నుంచే సోషల్‌ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ ఉండేది. 

అయితే కొన్ని రోజులుగా తమ కుమారుడు సౌరభ్‌ ఫోన్‌ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్లూడ్రమ్మును పరిశీలించిన అనంరతం సౌరభ్‌ భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ శుక్లాను అరెస్ట్‌ చేశారు. దాదాపు రెండేళ్ల విచారణ అనంతరం ఇప్పుడు కోర్టు వారిద్దరికీ ఉరిశిక్ష వేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యింది. క్షణికావేశంలో.. కామం మైకంలో అప్పుడు భర్త చావగా.. ఇప్పుడు వీరిద్దరూ చనిపోయారు. ఒక తప్పు ముగ్గురి ప్రాణాలు పోవడం కలచివేసే విషయం.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
National News
Viral News
Trending News