• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /KSRTC Pamba AC Bus: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్కడి నుంచి పంబకు నేరుగా ఏసీ బస్సులు!

KSRTC Pamba AC Bus: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్కడి నుంచి పంబకు నేరుగా ఏసీ బస్సులు!

KSRTC Pamba AC Bus Service Launched: శబరిమల అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేరళం రాష్ట్రంలోని KSRTC కీలక సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలోని కొచ్చి, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి పంబకు నేరుగా ఏసీ బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ టికెట్ ధరలను రూ.340, రూ.380గా నిర్ణయించారు.

Written ByHarish Darla
Published: Nov 20, 2026, 18:23 IST|Updated: Nov 20, 2026, 18:25 IST
joinshare
KSRTC Pamba AC Bus: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్కడి నుంచి పంబకు నేరుగా ఏసీ బస్సులు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

KSRTC Pamba AC Bus Service Launched: శబరిమలలోని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తూ కేరళ ప్రభుత్వం కొత్త బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల్లో కేరళంకు చేరుకునే యాత్రికులు విమానాశ్రయం నుంచి నేరుగా పంబకు వెళ్లేందుకు కేరళం స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) ప్రత్యేక ఏసీ బస్సులను ప్రారంభించింది. కొచ్చి, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ క్రమంలో తిరువనంతపురం విమానాశ్రయం నుంచి పంబకు తొలి ఏసీ బస్సును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విమానాల్లో వచ్చిన అయ్యప్ప భక్తులకు పూలు, స్వామివారి చిత్రపటాలను అందించి స్వాగతం పలికారు. విమాన ప్రయాణం తర్వాత పంబకు చేరుకోవడానికి భక్తులు ఇతర వాహనాల కోసం ఎదురుచూడాల్సిన అవసరాన్ని తగ్గించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.

ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేందుకు తిరువనంతపురం విమానాశ్రయం నుంచి పంబ వరకు రూ.340 టికెట్ ధర నిర్ణయించారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంబకు ప్రయాణ ఛార్జీ రూ. 380గా ఉంది. తిరువనంతపురం నుంచి రాత్రి 9:30 గంటలకు బస్సు బయలుదేరి, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7 గంటలకు చేరుకుంటుంది. కొచ్చి నుంచి రాత్రి 8:30 గంటలకు ప్రారంభమయ్యే బస్సు మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుంది.

విమాన ప్రయాణికులే కాకుండా ఇతర అయ్యప్ప భక్తులు కూడా ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. భక్తులు తమ ఇళ్ల వద్ద లేదా ఆలయాల వద్ద ఇరుముడి సిద్ధం చేసుకున్న అనంతరం నేరుగా పంబకు వెళ్లేందుకు చార్టర్డ్ బస్సులను కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. వ్యక్తులు, కుటుంబాలు, భక్తుల బృందాలు తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా బస్సులను ముందుగానే రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

టికెట్లను KSRTC అధికారిక వెబ్‌సైట్‌తో పాటు విమాన టికెట్ల బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా పొందవచ్చు. భక్తుల రద్దీ పెరిగితే అదనపు బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త సేవలతో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు విమానాశ్రయం నుంచి పంబ వరకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News