• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /iPhone 18 Pro Maxకు గట్టి పోటీ.. Samsung గెలాక్సీ S27 అల్ట్రా కెమెరా ఫీచర్లు లీక్!

iPhone 18 Pro Maxకు గట్టి పోటీ.. Samsung గెలాక్సీ S27 అల్ట్రా కెమెరా ఫీచర్లు లీక్!

Samsung Galaxy S27 Ultra: సాంసంగ్‌ త్వరలో విడుదల చేసే Samsung గెలాక్సీ S27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌కు గట్టి పోటీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. సాంసంగ్‌ కంపెనీ అద్భుతమైన కెమెరా లెన్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 30, 2026, 11:38 AM IST|Updated: Sep 30, 2026, 11:40 AM IST
joinshare
iPhone 18 Pro Maxకు గట్టి పోటీ.. Samsung గెలాక్సీ S27 అల్ట్రా కెమెరా ఫీచర్లు లీక్!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Samsung Galaxy S27 Ultra Camera Features: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మంచి గుర్తింపు పొందే దక్షిణ కొరియా దిగ్గజం Samsung తమ అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ప్రత్యేకమైన దృష్టి సారించిన్నట్లు తెలుస్తోంది. త్వరలో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్న Samsung Galaxy S27 Ultra స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని కెమెరా ఫీచర్స్‌ ఇటీవలే లీక్‌ అయ్యాయి. దీని బట్టి చూస్తే, సాంసంగ్‌ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో మొదటి స్థానంలో ఉంచేందుకు పెద్దగానే ప్లాన్‌ చేసిన్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) కెమెరా ఫీచర్స్‌ కంటే ఇందులో అద్భుతమైన ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్స్, సెన్సార్లను సిద్ధం చేస్తున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వార్మర్ కలర్ టోన్..
సాంసంగ్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్స్‌ నుంచి తీసే ఫోటోలలో కలర్స్‌ కాస్త ఓవర్-శాచురేటెడ్ ఉంటాయనే విమర్శలు కూడా గతంలో ఎన్నో వచ్చాయి. అయితే గెలాక్సీ S27 అల్ట్రాలో మాత్రం అద్భుతమైన కలర్‌ సైన్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.. ఇందులో వార్మర్ కలర్ టోన్స్ కూడా అందించబోతునట్లు తెలుస్తోంది. దీని వల్ల మనుషులకు సంబంధించిన స్కిన్‌ టోన్లు కూడా ఎంతో సహజంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రొఫెషనల్ కెమెరా స్థాయిలో దీని కెమెరా ఫీచర్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం.. కెమెరాలో  షాడో ప్రొడక్షన్ (Shadow Reproduction) నాణ్యతను భారీగా మెరుగుపరిచిన్నట్లు తెలుస్తోంది. తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. ఇవే కాకుండా ఫోటోలను మరింత అద్భుతంగా అదించేందుకు ప్రీమియం సెన్సార్లను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది డైనమిక్ రేంజ్‌ను అందిస్తూ.. ఫోటోలను మరింత సినిమాటిక్‌గా మారుస్తూ ఉంటాయని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు.

నెక్స్ట్-జెన్ జూమ్ ఆప్షన్‌..
సాంసంగ్‌ ఎంతో ప్రత్యేకతైన జూమ్‌తో పాటు నైట్ ఫోటోగ్రఫీ (Nightography)లో భాగంగా త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే ఈ మోడల్‌ అద్భుతమైన లెన్స్‌ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో సరికొత్త AI ఆధారిత ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP)ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీని వల్ల రాత్రి సమయాల్లో కూడా నాయిస్‌ ఏమాత్రం లేకుండా క్రిస్టల్ క్లియర్ ఫోటోలను అందిస్తుంది. ఇవేకాకుండా ఇందులో ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News