SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: ఇదెంట్రా సామి.. స్కూల్లో బాలుడి గుండుపై తబలా వాయిస్తు రీల్స్.. ఉపాధ్యాయుడిపై నెట్టింట దుమారం.. వీడియో..

Principal suspended in uttar pradesh: బాలుడి గుండుపై ఉపాధ్యాయుడు తబలా కొట్టిన ఘటనను జిల్లా ప్రాథమిక విద్యా అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 09, 2026, 03:52 PM IST | Updated: Oct 09, 2026, 03:56 PM IST
Image Credit: Etawah school Principal tabla news
Join

School Principal playing tabla in student bald  head in etawah: ఇటీవల కొంత మంది ఉపాధ్యాయులు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. స్కూల్ పిల్లల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారితో తమ వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటున్నారు.  కొంత మంది స్కూళ్లలో తమ తల వెంట్రుకలకు నూనె పెట్టించుకొవడం, మసాజ్ చేయించుకొవడం చేస్తున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు తప్పతాగి స్కూల్ కు వచ్చి విద్యార్థులను, స్కూల్ విద్యార్థులను వేధిస్తున్నారు.

 

 

 ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. యూపీలోని ప్రైమరీ స్కూల్ లో ఒక ఉపాధ్యాయుడు బాలుడు గుండుగీయించుకుంటే అతని తల మీద తబలా మాదిరి కొడుతూ రీల్స్ చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది.

 

ఉత్తర ప్రదేశ్ లోని బిరౌలీ పరిధిలోని ప్రైమరీ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దినేష్ కుమార్ మాథుర్ అనే ఉపాధ్యాయుడు స్కూళ్లోగుండు చేయించుకున్న ఒక విద్యార్థి తలపై తబలా వాయిస్తూ రచ్చచేశాడు. అచ్చం తబలా, గిటార్ ను ప్లే చేసినట్లు బాలుడి గుండు మీద ఇష్టమున్నట్టు కొట్టాడు. 

పాపం క్లాస్ లో బాలుడు ఇబ్బందులు పడుతున్న అతడిని వదల్లేదు. తన చేతులతోనే బాలుడి తల మీద కొడుతూ రచ్చ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో విద్యాశాఖ దీనిపై సీరియస్ అయ్యింది. సదరు ఉపాధ్యాయుడు దినేష్ కుమార్  ను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES